Macherla Niyojakavargam : నితిన్ పసిగుండె ‘అదిరిందే’

వెర్సటైల్ హీరో నితిన్ తాజాగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఈ సినిమా ఆగస్ట్ 12న థియేటర్లలోకి రానుంది. ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుంతం చిత్ర యూనిట్ దూకుడుగా ప్రమోషన్స్ చేస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన రెండు పాటలు, టీజర్ కొంత వరకు ఆకట్టుకుంటున్నాయి. అంజలి చేసిన స్పెషల్ సాంగ్ రా రా రెడ్డి మంచి టాక్ ను తెచ్చకుంది. ఇదిలా ఉండగా, మాచర్ల నియోజకవర్గం మేకర్స్ తాజా గా మరో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

అదిరిందే పసిగుండె.. అంటూ సాగిన పాట రొమాంటిక్ టాచ్ ఇస్తుంది. సాంగ్ లో నితిన్ కృతి శెట్టిలా కెమిస్ట్రీ బాగుంది. స్లోగా సాగుతూ మ్యూజిక్ ప్రియులను ఆకట్టుకుంటుంది. అలాగే ఈ పాటకు నితిన్, కృతి శెట్టి డ్యాన్స్ స్టయిలీస్ గా కూల్ గా ఉంది. మహతి స్వర సాగర్ మ్యూజిక్ బాగుంది. కృష్ణకాంత్ అందించిన సాహిత్యం క్యాచిగా వుంది.

ఇదిలా ఉండగా, మాచర్ల నియోజక వర్గం సినిమాలో కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే అంజలి స్పెషల్ సాంగ్ లో సందడి చేయబోతుంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్ తో మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 29న థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు