Adhurs Sequel : అదుర్స్ 2 కోసం నిరాహార దీక్ష…. ఎన్టీఆర్ ఇంటి ముందు టెంట్ వేస్తా అంటున్న కోన వెంకట్

Adhurs Sequel : యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ సినిమాల్లో అదుర్స్ కూడా ఒకటి. గత కొంతకాలంగా ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ చేయాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. త్వరలోనే అదుర్స్ 2 సెట్స్ పైకి వెళ్ళబోతోంది అని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరోసారి అదుర్స్ సీక్వెల్ గురించిన వార్తలు కోన వెంకట్ కారణంగా తెరపైకి వచ్చాయి. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ ఇంటి ముందు టెంట్ వేసి నిరాహాదీక్ష చేస్తానంటూ రైటర్, నిర్మాత కోన వెంకట్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

అదుర్స్ సీక్వెల్ పై కోన వెంకట్ కామెంట్స్…

వివి వినాయక్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అదుర్స్. 2010లో రిలీజ్ అయిన ఈ మూవీలో నయనతార, షీలా హీరోయిన్లుగా నటించారు. ఎన్టీఆర్ ఈ మూవీలో ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకున్నారు. ఈ మూవీకి ప్రముఖ రచయిత కోన వెంకట్ కథను అందించారు. ఇందులో ఎన్టీఆర్, బ్రహ్మానందం అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇకపోతే అదుర్స్ మూవీకి సీక్వెల్ చేయాలని చాలా కాలంగా ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో రచయిత కోన వెంకట్ అదుర్స్ సీక్వెల్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అదుర్స్ సీక్వెల్ పక్కాగా ఉంటుందని గుడ్ న్యూస్ చెప్పారు. కానీ అక్కడితో ఆగకుండా తారక్ ఇంటిముందు అవసరమైతే టెంట్ వేసి నిరాహార దీక్ష చేసి అయినా అదుర్స్ 2 చేస్తానని అన్నారు. ఇండియన్ ఇండస్ట్రీలోనే ఎన్టీఆర్ లా నటించే యాక్టరే లేడు అంటూ తారక్ ను ఆకాశానికి ఎత్తేశాడు. దీంతో మరోసారి అదుర్స్ సీక్వెల్ వార్తల్లోకి ఎక్కింది.

అదుర్స్ 2 అయ్యే పనేనా?

అదుర్స్ 2 ( Adhurs Sequel ) చేసే ఆలోచన ఉందని డైరెక్టర్ వివి వినాయక్ పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు. గత ఏడాది కోన వెంకట్ ఈ సీక్వెల్ స్టోరీ లైన్ ను కూడా బయట పెట్టారు. తాను సీక్వెల్ కి కథను ఎప్పుడో అనుకున్నానని, తన గురువు గారితో కలిసి అమెరికా వెళ్లిన చారికి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేదే కథ అని ఆయన వెల్లడించారు. ట్విస్టులు, టర్న్ లతో గ్రిప్పింగ్ గా ఉండే స్టోరీ అని, ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మూడు నెలల్లోనే స్క్రిప్ట్ రెడీ చేసి షూటింగ్ కి వెళ్ళిపోతామని చెప్పుకొచ్చాడు. అప్పటినుంచి ఇప్పటివరకు కోన వెంకట్ సందర్భంగా వచ్చినప్పుడల్లా అదుర్స్ సీక్వెల్ గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. కానీ తారక్ మాత్రం సీక్వెల్ విషయంలో ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నాడు. దీంతో ఈ మాటలు ఎన్టీఆర్ చెవిన పడట్లేదా, లేదంటే ఆయనకు సీక్వెల్ పై ఇంట్రెస్ట్ లేదా అనే అనుమానాలు మొదలవుతున్నాయి. మరోవైపు గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఉన్న పరిస్థితుల్లో అదుర్స్ సీక్వెల్ పట్టాలు ఎక్కాలంటే నిజంగానే కోన వెంకట్ ఎన్టీఆర్ ఇంటి ముందు టెంట్ వేసినా అయ్యే పనేనా?

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు