Vijay – Mrunal : విజయ్ రూటే సపరేట్.. అలా ఎంట్రీ ఇవ్వడంతో..!

Vijay – Mrunal : రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ చేసిన ఒక పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాగూర్ జంటగా దిల్ రాజు నిర్మాణంలో పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఫ్యామిలీ స్టార్..ఏప్రిల్ 5వ తేదీన థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది.. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా తాజాగా నిన్న రాత్రి హైదరాబాదులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.. ఇక ఈవెంట్లో విజయ్ చేసిన పని అందరిని ఆశ్చర్యపరుస్తోంది..

బైక్ పై మృణాల్ తో విజయ్..

సాధారణంగా విజయ్ దేవరకొండ అందరి హీరోల కంటే కాస్త భిన్నంగానే ఉంటారని చెప్పవచ్చు.. ఏదైనా సరే కొత్తగా ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.. అందులో భాగంగానే ఆయన ఇచ్చే స్పీచ్ లు, ఆయన సినిమాలు అన్నీ కూడా డిఫరెంట్ గానే ఉంటాయి. అందుకే తక్కువ సమయం లోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో.. ఎవరికి వాళ్లు స్టార్స్ కారులో వచ్చి పార్కింగ్ నుంచి స్టేజ్ వరకు నడిచి వచ్చారు.. కానీ విజయ్ దేవరకొండ మాత్రం బైక్ పై మృణాల్ ఠాగూర్ ని ఎక్కించుకొని.. బయట నుంచి స్టేజ్ వరకు తీసుకొచ్చారు.. ఇక చుట్టూ కెమెరాలు , బౌన్సర్ల మధ్య విజయ్ మృణాల్ ( Vijay – Mrunal  ) ను బైక్ పై తీసుకురావడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది.. అంతేకాదు ఈ సంఘటన చూసి అటు సెలబ్రిటీలు ఇటు అభిమానులు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు

నెట్టింట వీడియో వైరల్..

ఇక తాజాగా విజయ్ దేవరకొండ చేసిన ఈ పనికి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు
ఎంతైనా విజయ్ దేవరకొండ రూటే సపరేట్ అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారుతోంది.

- Advertisement -

విజయ్ దేవరకొండ కెరియర్..

ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలు పెట్టిన విజయ్ దేవరకొండ.. పెళ్లిచూపులు సినిమాతో హీరోగా తన ప్రయాణం మొదలుపెట్టారు. రెండవ సినిమానే సందీప్ రెడ్డి వంగాతో అర్జున్ రెడ్డి అనే సినిమాను తెరకెక్కించి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయారు.. ఆ తర్వాత నటించిన గీతాగోవిందం సినిమా కూడా డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా విజయాన్ని అందుకుంది.. ఇక తర్వాత ఈయన తీసిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదని చెప్పాలి.. రీసెంట్గా ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ పర్వాలేదు అనిపించుకున్నారు.. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.. మరి ఈ సినిమా విజయ్ కెరీర్ కు ఎలాంటి దారి చూపిస్తుందో చూడాలి. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 5 న థియేటర్లలోకి రాబోతోంది ఫ్యామిలీ స్టార్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు