Karthik Raju : యాక్ష‌న్ లుక్

సాధార‌ణంగా ఒక సినిమాపై బ‌జ్ క్రియేట్ చేయ‌డం, ఆడియ‌న్స్‌కి ఆస‌క్తి క‌లిగించేలా ప్ర‌మోష‌న్స్ చేయ‌డం మామూలు విష‌యం కాద‌నే చెప్పాలి. కానీ యంగ్ హీరో కార్తీక్ రాజు ప్ర‌ధాన పాత్ర‌లో పెగ్గో ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న చిత్రం అధ‌ర్వ‌. ఈ చిత్రం ప్రారంభం నుంచే ప్రేక్ష‌కులకు ఆస‌క్తి క‌లిగే విధంగా ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు.

క్రైమ్ థిల్ల‌ర్ సినిమా డిఫ‌రెంట్ కాన్సెప్ట్ ట‌చ్ చేస్తూ రాబోతున్న ఈ సినిమాకి మ‌హేష్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. సుభాష్ నూత‌ల‌పాటి నిర్మాణ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. నూత‌ల‌పాటి న‌ర‌సింహం, అన‌సూయ‌మ్మ స‌మ‌ర్ప‌ణ‌లో తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏక‌కాలంగలో ఈ సినిమాను గ్రాండ్‌గా రూపొందిస్తున్నారు.

ఇటీవ‌లే మాస్ మ‌హారాజా ర‌వితేజ చేతుల మీదుగా విడుద‌ల చేయించిన టైటిల్ లోగో, మోష‌న్ పోస్ట‌ర్ కి విశేష‌మైన స్పంద‌న వ‌చ్చింది. ముఖ్యంగా నేను న‌మ్మిన స‌త్యం, వెతికే ల‌క్ష్యం, దొర‌కాల్సిన సాక్ష్యం చేధించే వ‌ర‌కు ఈ కేసును వ‌దిలిపెట్ట‌ను సార్ అంటూ చెప్పిన డైలాగ్ అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తించింది. తాజాగా ఈ చిత్రం నుంచి హీరోకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో హీరో యాక్ష‌న్ లుక్ లో క‌నిపించారు. ఇందులో హీరో కార్తీక్ రాజు ప‌వ‌ర్‌పుల్ రోల్‌ను పోషించిన‌ట్టు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు