Kavya Kalyanram: బలగం హీరోయిన్… చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన మూవీస్

టాలీవుడ్ లో రీసెంట్ గా వచ్చిన ‘బలగం’ మూవీ గురించి అందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ ఎమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచి కమర్షియల్ గాను భారీ విజయాన్ని అందుకుంది. జబర్దస్త్ ఫేమ్ వేణు వెల్దండి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా… ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ కావ్య చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ కనిపించింది. ఈమె మొదటి సినిమా “గంగోత్రి”. ఈ మూవీ లో చిన్నప్పటి హీరోయిన్ పాత్రలో కనిపించింది. అయితే ఆ చిత్రం వచ్చి దాదాపు 20 సంవత్సరాలు పూర్తయింది. ఇక ఈమె నటించిన “ఉస్తాద్” చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. కీరవాణి తనయుడు సింహ హీరోగా నటించాడు. వారాహి బ్యానర్ పై ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. అలాగే అక్కినేని నాగార్జున, సుమంత్ కాంబినేషన్లో వచ్చిన “స్నేహమంటే ఇదేరా” సినిమాలో కావ్య చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “బాలు” మూవీలో కూడా కావ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది కావ్య. మెగాస్టార్ చిరంజీవి నటించిన “ఠాగూర్”, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “అడవి రాముడు” చిత్రంలో కూడా చైల్డ్ ఆర్టిస్టుగా అద్భుతంగా నటించింది. ఈ రెండు సినిమాలు కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ కెరీర్ లో చాలా గుర్తింపును తెచ్చాయి. వీటితో పాటు బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన విజయేంద్ర వర్మ మూవీలో కూడా కావ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.

- Advertisement -

బన్నీ సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది కావ్య. సుభాష్ చంద్రబోస్ మూవీలో కూడా కావ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. బాలకృష్ణ హీరోగా నటించిన పాండురంగడు మూవీలోనూ కావ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇక తాజాగా బలగంతో మరో సంచలన విజయాన్ని అందుకుంది. దీని తర్వాత చిన్న సినిమాలకు ఈమె మంచి ఆప్షన్ గా నిర్మాతలకు కనిపిస్తుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు