Rowdy Hero: డిజాస్టర్ పడినా యాటిట్యూడ్ మార్చుకోని రౌడీ హీరో..!

విజయ్ దేవరకొండ, కెరీర్ తొలినాళ్లలో సైడ్ క్యారెక్టర్లు చేసి పెళ్లిచూపులు సినిమా ద్వారా హీరోగా మారి, తొలి సినిమాతోనే హిట్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వటంతో హీరోగా విజయ్ రేంజ్ పెరగటమే కాకుండా తన యాటిట్యూడ్ కూడా మారింది. అర్జున్ రెడ్డి సినిమాలో చేసిన క్యారెక్టర్ ప్రభావమో ఏమో కానీ, అప్పటి నుండి విజయ్ తనని తాను డిఫరెంట్ గా ప్రాజెక్ట్ చేసుకోవడం మొదలు పెట్టాడు. ఈ యాటిట్యూడ్ అతనికి యూత్ లో ఫాలోయింగ్ పెంచినప్పటికీ అదే రేంజ్ లో నెగిటివిటీ కూడా తెచ్చి పెట్టింది. ఇటీవల లైగర్ సినిమా డిజాస్టర్ అవ్వటానికి ఈ నెగిటివిటీ కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. తాజాగా తన యాటిట్యూడ్ వల్ల మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు విజయ్ దేవరకొండ.

విజయ్, సమంత కాంబినేషన్లో రూపొందిన ఖుషి సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ ని విడుదల చేసింది సినిమా యూనిట్. ఆ పోస్టర్లో  ‘ది విజయ్ దేవరకొండ’ అని ఉండటం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. అమితాబ్, చిరంజీవి, రజిని లాంటి దిగ్గజాలే వారి పేర్లకు ముందు ‘ది’ అని యాడ్ చేసుకోలేదు, అలాంటిది పట్టుమని పది హిట్లు కూడా లేని విజయ్ తనని తాను ‘ది’ అని సంబోదించుకోవటం విడ్డూరం అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. లైగర్ లాంటి డిజాస్టర్ వచ్చినా కూడా విజయ్ పైత్యం మాత్రం తగ్గలేదని కామెంట్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో కూడా తన పేరుకి ముందు ‘ది’ అన్న ట్యాగ్ ని పెట్టుకున్న విజయ్ ఇప్పుడు ఆ ట్యాగ్ ని పబ్లిక్ ప్లాట్ఫార్మ్ పైకి తేవటం వివాదాస్పదం అయ్యింది. సోషల్ మీడియా వరకు ఆ ట్యాగ్ ని వాడుకోవటం తన వ్యక్తిగత అంశం. పబ్లిక్ ప్లాట్ఫార్మ్ పై అలాంటి ట్యాగ్ ని జనాలు యాక్సెప్ట్ చేయాలంటే అంత ఆషామాషీ విషయం కాదు. కెరీర్లో ఇప్పుడిపుడే ఎదుగుతున్న విజయ్ లాంటి హీరోలను ఇలాంటి ట్యాగ్ లైన్స్ తో పిలవటానికి జనాలు ఆసక్తి చూపరు.

- Advertisement -

ఈ క్రమంలో, ఇదే అంశంపై యాంకర్ అనసూయ స్పందిస్తూ ‘ఇప్పుడే ఒకటి చూసాను “ది” నా బాబోయ్ పైత్యం, ఏం చేస్తాం అంటకుండా చూసుకుందాం’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. అంతే, ఇక అనసూయపై విజయ్ ఫ్యాన్స్ మాటల దాడి మొదలెట్టారు. ఆడు, అదుపు లేకుండా నోటికి ఎంత మాటొస్తే అంత మాట అంటూ అనసూయ ట్వీట్ కి రిప్లై ఇస్తున్నారు. చాలా మంది నుండి వినిపిస్తున్న అభిప్రాయాన్నే అనసూయ ట్వీట్ చేసింది అయినప్పటికీ విజయ్ ఫ్యాన్స్ అనసూయని మాత్రమే టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ గనక ఇలాగే కొనసాగితే విజయ్ పై మరింత నెగిటివిటీ పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నెట్టింట దుమారం లేపుతున్న రేపుతున్న తన ట్యాగ్ లైన్ విషయంలో విజయ్ స్పందించి దాన్ని మార్చుకుంటాడా లేదా, అభిమానంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్న తన ఫ్యాన్స్ ని కట్టడి చేస్తాడా లేదా చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు