సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో పండుగల సీజన్‌లో సినిమాలు చాలా ఎక్కువగా విడుదలవుతుంటాయి. ముఖ్యంగా సంక్రాంతి, దసరా వంటి పండుగల సీజన్‌లో విడుదల చేస్తే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తారని దాదాపు పెద్ద హీరోలు పండుగ సీజన్ లో సినిమాలను విడుదల చేస్తుంటారు. అందులో కొందరూ సక్సెస్ అయితే మరికొందరూ ఫెయిల్ అవుతుంటారు.
కేవలం హీరోలు మాత్రమే కాకుండా.. టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఖచ్చితంగా పండగ సీజన్‌లో ఏదో ఒక సినిమా ఉండేలా ప్లాన్ చేస్తుంటాడు. 2013 సంక్రాంతి పండుగ సందర్భంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా వచ్చింది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకట్టుకొని భారీ విజయం సాధించింది. అదే ఏడాది దసరా పండుగకి ఎన్టీఆర్ నటించిన రామయ్యా వస్తావయ్య సినిమాని నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు.
Read More: మరోసారి దేవుడిలా
2014లో రామ్ చరణ్ నటించిన ఎవడు సినిమాని దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. 2017లో ముఖ్యంగా సంక్రాంతి పండుగకి మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణి, శర్వానంద్ నటించిన శతమానం భవతి సినిమాలు వచ్చాయి. అందులో శతమానం భవతి సినిమాకి దిల్ రాజు నిర్మాత కావడం విశేషం. సంక్రాంతి సీజన్‌లో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ అందుకొని ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించింది.
ఆ తరువాత 2019లో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా నటించిన మల్టీస్టారర్ మూవీ ఎఫ్2. అలాగే 2020 సంక్రాంతి పండుగకి మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రం వచ్చింది. అలాగే 2023 సంక్రాంతి పండుగకి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాలతో పాటు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన వారసుడు సినిమా వస్తుంది. దిల్ రాజు వారసుడు సినిమా సంక్రాంతికి విడుదల చేస్తే చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు థియేటర్లు దొరుకుతాయా లేదా అనేది ఇప్పుడు సందిగ్దంగా మారింది. ఏం జరుగుతుందనేది తెలియాలంటే సంక్రాంతి పండుగ వరకు వేచి చూడాల్సిందే.
Read More: సినిమా ఫట్ , నో ప్రాఫిట్
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...
నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ...