‘ఆచార్య’ 10 రోజుల కలెక్షన్లు..!

మెగాస్టార్ చిరంజీవి -కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఆచార్య’ చిత్రం భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 29న విడుదలై మొదటి షోతోనే ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రానికి కో- ప్రొడ్యూసర్ గా వ్యవహరించడంతో పాటు ‘సిద్ధ’ అనే ముఖ్య పాత్రలో కనిపించాడు.స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే.. హీరో చరణ్ కు జోడీగా నటించింది. వీళ్ళ స్టార్ డం కూడా ఈ మూవీ పై భారీ అంచనాలు నమోదయ్యేలా చేసింది. కానీ అది కూడా ఈ మూవీ బాక్సాఫీస్ రన్ కు ఉపయోగపడడం లేదు. మొదటి రోజు నుండీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణమైన పెర్ఫార్మన్స్ ఇస్తుంది. ఒకసారి ‘ఆచార్య’ 10 రోజుల కలెక్షన్లను పరిశీలిస్తే :

నైజాం : 12.32 కోట్లు
సీడెడ్ : 6.11 కోట్లు
ఉత్తరాంధ్ర : 4.81 కోట్లు
ఈస్ట్ : 3.22 కోట్లు
వెస్ట్ : 3.35 కోట్లు
కృష్ణా : 3.05 కోట్లు
గుంటూరు : 4.51 కోట్లు, నెల్లూరు : 2.91 కోట్లు

ఏపి + తెలంగాణ : 40.28 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 2.75 కోట్లు, ఓవర్సీస్ : 4.73 కోట్లు

- Advertisement -

వరల్డ్ వైడ్ టోటల్ : 47.76 కోట్లు(షేర్)

‘ఆచార్య’ చిత్రం రూ.135 కోట్ల(షేర్) టార్గెట్ తో బరిలోకి దిగింది. 10 రోజులకి ఈ మూవీ రూ.47.76 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ అసాధ్యమని తేలిపోయింది.కనీసం రెండో వీకెండ్ ను కూడా ఈ మూవీ వాడుకోలేకపోయింది. ‘జయమ్మ పంచాయితీ’ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రాలు ‘ఆచార్య’ ని మించి ఈ వీకెండ్ ను క్యాష్ చేసుకున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు