సర్కారు పండుగ షూరు..

ఒక సినిమా రిలీజ్ కు రెడీ గా ఉందంటే.. ఆ మూవీ టీం ముందు ఉన్న ప్రధాన లక్ష్యం ప్రమోషన్స్. ఒక్క సినిమా హిట్ కావాలన్నా.. ఫట్ అవ్వాలన్నా.. ప్రమోషన్స్ పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే పలువురు డైరెక్టర్లు, నిర్మాతలు ప్రమోషన్స్ కు కోట్లు కుమ్మరిస్తారు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట టీం మాత్రం ప్రమోషన్స్ ను లైట్ తీసుకున్నారు. 

మరో మూడు రోజుల్లో సర్కారు వారి పాట రిలీజ్ కాబోతున్నా.. ఈ మూవీకి కావాల్సినంత హైప్ రాలేదన్నది బహిరంగ సత్యం. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ తో ఆకట్టుకున్నా.. ప్రమోషన్స్ లో మాత్రం మూవీ యూనిట్ వెనకపడ్డారు. ఇప్పటికే సర్కారు వారి ప్రీ – రిలీజ్ ఈవెంట్.. ప్లాప్ అయినట్టు ఇండస్ట్రీ వర్గాల నుంచి గుస గుసలు వినిపిస్తున్నాయి.

మహేష్ కూడా తన అంతర్గత సిబ్భందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ప్రీ – రిలీజ్ ఈవెంట్ వర్కౌట్ కాకపోవడంతో సూపర్ స్టార్ మహేష్ బాబే స్వయంగా రంగంలోకి దిగి ప్రమోషన్స్ పనుల్లో స్పీడ్ పెంచేశాడు. వరుసగా ఇంటర్వ్యూ లు ఇవ్వడంతో పాటు ప్రెస్ మీట్లు పెట్టాలని డైరెక్టర్ పరుశురామ్ తో చెప్పినట్టు సమాచారం. 

- Advertisement -

అందులో భాగంగా యాంకర్ సుమతో మహేష్, పరుశురామ్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ యూట్యూబ్ ఛానల్ లో ఇది స్ట్రీమింగ్ అవుతుంది. మరింత దూకుడుగా.. ప్రమోషన్స్ చేయడానికి మహేష్ రెడీ అవుతున్నాడట. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు