పూరి జగన్నాధ్ స్టార్ హీరోస్ చేతిలో లో బ్లాక్ బస్టర్ హిట్ లు పెట్టాడు, డైరెక్టర్ గా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించాడు.
ఈయన సినిమాల్లో హీరో లు రఫ్ గా,కాన్ఫిడెన్స్ తో కనిపిస్తారు,
అప్పటివరకు సినిమాల్లో హీరో లు అంటే మంచితనానికి మారుపేరు లా ఉండేవారు,పూరి వచ్చాక వాళ్ళు మొండితాననికి మారుపేరు లా మారారు.
గట్టిగ మాట్లాడితే ఇండస్ట్రీ కి అటిట్యూడ్ అంటే ఏంటో తెలిసింది పూరి సినిమాల వలనే.
పోకిరి,బిజినెస్ మ్యాన్ లాంటి సినిమాలు పూరి కెరియర్ లో ఇండస్ట్రీ లో హిట్ లు,అతి తక్కువ టైం లో షూటింగ్ ఫినిష్ చేసి రిలీజ్ చేయడం పూరి కి వెన్నతో పెట్టిన విద్య.
ఇప్పుడు చేస్తున్న” లైగర్” సినిమా హిట్ అయితే విజయదేవరకొండ పేరుతో పాటు పూరి పేరు కూడా సౌత్ ఇండియాలో మారుమ్రోగుతుంది. ఇప్పుడే రిలీజ్ చేసిన “లైగర్ హంట్ థీమ్ వీడియో చూస్తుంటే పూరి హిట్టు కొట్టడం ఖాయం అనిపిస్తుంది . ఈ సినిమాని ఆగస్టు 25 న రిలీజ్ చేయనుంది మూవీ టీం. 2017 లో ఆగస్టు 25 అర్జున్ రెడ్డి సినిమా రిలీజై సంచలనం సృష్టించింది. మళ్ళీ ఐదేళ్ల తరువాత అదే డేట్ కి రాబోతున్న ఈ సినిమా ఏ స్థాయి హిట్ అవుతుందో తెలియాలి అంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.