సర్కారు వారి రచ్చ స్టార్ట్..

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట పండుగ స్టార్ట్ అయింది. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కాసేపటి క్రితమే ఓపెన్ అయ్యాయి. సర్కారు వారి పాట అఫీషియల్ ట్విట్టర్ ఖాతాతో మూవీ యూనిట్ ప్రకటించింది.

కాగ ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అవ్వాల్సింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల ధరలు పెంచలేకపోవడంతో.. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజ్ ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నారు. కానీ తాజా గా తెలంగాణ సర్కారు.. సర్కారు వారి పాట మూవీ టికెట్ పై రూ. 30 నుంచి రూ. 50 వరకు పెంచింది.

దీంతో మూవీ టీం.. నైజం ఏరియాలో అడ్వాన్స్ బుకింగ్స్ కు అనుమతి ఇచ్చింది. బుక్ మై షో లో ప్రస్తుతం ఈ మూవీ టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. కాగ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ మూవీ ఈ నెల 12న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు