“సూల్తాన్.. యుద్ధం కోరుకుంటే… సిద్ధమే. మా ప్రాణాలైన అర్పిస్తాం కానీ.. మా దేశం నుంచి పిడికెడు మట్టీ కూడా సుల్తాన్ కు ఇవ్వం “ వంటి పవర్ ఫుల్ డైలాగ్స్ తో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అదరగొట్టాడు. 12వ శాతబ్దంలో ఢిల్లీ పాలించిన పృథ్వి రాజ్ చౌహాన్ అనే రాజు జీవిత చరిత్ర ఆధారంగా అక్షయ్ కుమార్ పృథ్వి రాజ్ సినిమా చేస్తున్నాడు. చంద్ర ప్రకాష్ ద్వివేది దర్శకత్వం చేస్తుండగా.. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా ఈ మూవీని నిర్మిస్తున్నాడు.
పృథ్వి రాజ్ భార్య సంయోగిత పాత్రలో మాజీ మిస్ యూనివర్స్ మనుషీ చిల్లర్ నటించింది. అలాగే సంజయ్ దత్, సోనూ సూద్, అశుతోష్ రాణా, మానవ్ విజ్, సాక్షి తన్వర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ.. జూన్ 3 వ తేదీన పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజా గా పృథ్వి రాజ్ మూవీ ట్రైలర్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది.
ట్రైలర్ మొత్తం దేశభక్తి, పృథ్వి రాజ్ చౌహాన్ ధైర్య సహసాలతో నిండి ఉంది. అలాగే పృథ్వి రాజ్ – సంయోగిత మధ్య ప్రేమాయణాన్ని కూడా డైరెక్టర్ చూపించాడు. సంజయ్ దత్, సోనూ సూద్ తో పాటు మహ్మద్ ఘోరీ పాత్రలో మానవ్ విజ్ అద్భుతంగా నటించారు. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు పోస్టర్స్ మాత్రమే రాగ.. ప్రస్తుతం ట్రైలర్ తో ఒక్క సారిగా హైప్ పెరిగిపోయింది.