నా జీవితాన్ని తీసుకెళ్ల‌గ‌ల‌వు కానీ దేశాన్ని కాదు.

చాలామంది పుడతారు, చచ్చిపోతారు. కానీ కొందరు మాత్రమే చరిత్ర పుటల్లో నిలిచిపోతారు, కొందరి జీవితాల త్యాగమే ఈ రోజు మనకు స్వేచ్ఛ. 26/11… ముంబై తాజ్ హోటల్ లో జరిగిన ఉగ్రదాడికి మాత్రమే కాదు, ఒక దేశ సైనికుడు ధైర్యానికి కూడా గుర్తుండే రోజు. మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ ఈ ఘ‌ట‌న‌లోనే ప్రాణాలు కోల్పోయారు.

ఆయ‌న క‌థ‌ని.. ఇప్పుడు మేజ‌ర్‌గా సినిమాగా తెరకెక్క్కిస్తున్నారు.
ఈ సినిమా జూన్ 3న రిలీజ్ కానుంది, ఈ సంధర్బంగా ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేశారు. ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఉత్కంఠగా సాగింది, అప్పటి పరిస్థితిలను, ఆ ఘటనను కళ్ళకు కట్టినట్లు చుపించారు అని చెప్పొచ్చు.

ఈ ట్రైలర్ లో ప్ర‌కాష్‌రాజ్ ఉద్వేగంతో చెప్పిన డైలాగ్స్ కి గూస్బూమ్స్ వస్తాయి “మైస‌న్ మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్‌. వెన‌క‌డుగు వేసే అవ‌కాశం ఉంది. త‌ప్పించుకునే దారి ఉంది. ముందుకెళ్తే చ‌నిపోతాడ‌ని తెలుసు. ఐనా వెళ్లాడు. చావు క‌ళ్ల‌ల్లోకి చూసి నువ్వు నా జీవితాన్ని తీసుకెళ్ల‌గ‌ల‌వు కానీ దేశాన్ని కాదు.
అనే ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్స్ ఈ ట్రైలర్ లో హైలెట్స్.
ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతుంది.
ఈ ట్రైలర్ ను తెలుగులో మహేష్ బాబు, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ , హిందీలో సల్మాన్ ఖాన్ రిలీజ్ చేసారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు