Mindset Makeover: మీ జీవితం కొత్త మలుపు తిరగాలనుకుంటున్నరా? ఈ 5 బుక్స్ మీకోసమే!

కొత్త సంవత్సరం రాబోతోంది. అప్పుడే గతంలో జరిగిన సంఘటనలు, భావోద్వేగాలను పక్కనపెట్టి న్యూ ఇయర్ న్యూ లైఫ్ లోకి అడుగు పెట్టాలని ఆలోచన కూడా మొదలైపోయింది. గత అనుభవాలతో వచ్చిన ఎక్స్పీరియన్స్ తో ముందు ముందు జీవితాన్ని మరింత సమర్థవంతంగా సాగించాలని కోరుకునే వాళ్ళు మనలో ఎంతోమంది ఉంటారు. అలాగే ఇప్పటికైనా లైఫ్ లో ఏదైనా ఒక మంచి టర్నింగ్ పాయింట్ ఉంటే బాగుంటుందని, లేదా జీవితం ఒక కొత్త మలుపు తిరిగితే బాగుంటుందని అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఐదు ముఖ్యమైన పుస్తకాలు పరిచయం చేయబోతున్నాం. ఈ ఐదు పుస్తకాలను చదివిన తర్వాత లైఫ్ పట్ల మీకు ఇప్పటిదాకా ఉన్న అభిప్రాయం మారిపోవడం ఖాయం. అలాగే ఈ బుక్స్ చదివిన తర్వాత మీరు అనుకుంటున్నట్టుగానే మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పుకోవచ్చు. అంతేకాదు ఈ ప్రపంచాన్ని ఇప్పటిదాకా మీరు చూసింది ఒక లెక్క, ఈ బుక్స్ చదివాక చూసేది మరో లెక్క అన్నట్టుగా ఉంటుంది. లైఫ్ ఎలా ఉండాలి అన్నది మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మనకు తెలియని విషయాలను ఈ బుక్స్ చదివి తెలుసుకొని, ఆ తర్వాత లైఫ్ లో తీసుకోవాల్సిన ముఖ్యమైన నిర్ణయాలను తెలివిగా తీసుకుంటే జీవితం ఇంకా హ్యాపీగా గడుస్తుంది. మరి మీ జీవితాన్ని మార్చబోయే ఆ ఐదు బుక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో
థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో బుక్ ను ప్రముఖ మనస్తత్వవేత్త, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ల్ అవార్డును అందుకున్న డేనియల్ కహ్నేమాన్ రచించారు. ఈ బుక్ లో ఆయన రెండు రకాల ఆలోచన వ్యవస్థల గురించి రాసుకొచ్చారు. ఒకటి వేగంగా ఆలోచించడం, రెండోది నెమ్మదిగా ఆలోచించడం. అయితే ఈ రెండు విధానాల వల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి? వాటి వల్ల తలెత్తే సమస్యలను ఎలా పరిష్కరించాలి అనే విషయాన్ని ఈ బుక్ చదివి తెలుసుకోవచ్చు. ఇక ఈ బుక్ చదివితే మానవ ఆలోచన విధానం, సరైన నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలపై మంచి పట్టు సాధిస్తారు.

2. డ్రైవ్
ఈ బుక్ ను డేనియల్ హెచ్ పి అనే రచయిత రాశారు. ఈ బుక్ లో మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడంలో, లేదంటే చేసే పనిలో మనల్ని ఎలాంటి అంశాలు ప్రేరేపిస్తాయి అనే విషయాల గురించిన ఆశ్చర్యకరమైన నిజాలను వెల్లడించారు. ఇందులో మూడు మోటివేషనల్ కీలక అంశాలు ఉంటాయి. 1. నైపుణ్యం, 2. ప్రయోజనం, 3. స్వయం ప్రతిపత్తి (ఆటోనమి). ఈ మూడు ముఖ్యమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని మనస్తత్వశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, ప్రవర్తన శాస్త్రాలను పరిగణలోకి తీసుకుని రీసెర్చ్ చేసిన అనంతరం వచ్చిన ఫలితాలను ఇందులో ప్రస్తావించారు డేనియల్. ఇక ఈ బుక్ చదివిన తర్వాత నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిమ్మల్ని ప్రేరేపించే భావోద్వేగాలు, అలాగే వృత్తిపరమైన వ్యక్తిగత విషయాలలో కలిగే ప్రయోజనాలు వంటి విషయాలను పర్ఫెక్ట్ గా తెలుసుకోవడానికి పలు కొత్త విధానాలు తెలుసుకుంటారు.

- Advertisement -

3. మైండ్ సెట్
మైండ్ సెట్ : ది న్యూ సైకాలజీ ఆఫ్ సక్సెస్ అనే ఈ పుస్తకాన్ని కరోల్ ఎస్. డ్వేక్ రచించారు. ఆయన ఈ బుక్ లో స్థిర మనస్తత్వం, గ్రోత్ మనస్తత్వం అనే రెండు ప్రాథమిక మనస్తత్వాల ఆలోచనలను పరిచయం చేశారు. ఈ బుక్ ను చదవడం వల్ల దీన్నే మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఎదురుదెబ్బలు ఎదుర్కోవడం, విమర్శలను పాజిటివ్గా మార్చుకొని టార్గెట్ ను ఎలా రీచ్ అవ్వాలి, సవాళ్లను అవకాశాలుగా స్వీకరించడం ఎలా? వృద్ధి, అభివృద్ధి సాధించడానికి మీలో ఉన్న సామర్థ్యాలు ఎలా గుర్తించాలి అనే విషయాలను తెలియజేస్తుంది.

4. ది హ్యాపీనెస్ ట్రాప్
ది హ్యాపీనెస్ ట్రాప్ అనే జీవితాన్ని రస్ హారిస్ అనే మానసిక వైద్యుడు రచించాడు. మనల్ని ఆనందంలో ముంచేసే అపోహలు, రిచ్ గా, అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన అంశాలలో ఎలా ఉండాలి? ఏం నేర్చుకోవాలి వంటి విషయాలను ఈ బుక్ తెలియజేస్తుంది.

5. అటామిక్ హ్యాబిట్స్
అటామిక్ హ్యాబిట్స్ అనే బుక్ ను జేమ్స్ క్లియర్ అనే రచయిత రాశారు. ఈ బుక్ లో వ్యక్తిగత, వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడానికి ఎలాంటి అలవాట్లను అలవాటు చేసుకోవాలి? మీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలి వంటి విషయాలను వెల్లడించారు. ఈ లాజిక్ తెలిస్తే డెవలప్ అవ్వడం, సక్సెస్ ఫుల్ గా వ్యాపారం చేయడం, ఆరోగ్యంగా ఉండడం వంటి ముఖ్యమైన అంశాలను తెలుసుకోవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు