Tollywood: 2023లో ఎక్కువ సినిమాలు చేసిన హీరో ఎవరో తెలుసా?

టాలీవుడ్ లో 2023 లో స్టార్ హీరోలు చాలా తక్కువ సినిమాలు చేయగా, కొందరు అసలు ఒక్క సినిమాతో కూడా ఆడియన్స్ ముందుకు రాలేదు. కానీ చిన్న హీరోలు మాత్రం హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో సందడి చేసారు. కానీ వాళ్లలో ఎవరూ పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే ఎదో ఒక సినిమాతో వచ్చి ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నం చేసారు. కానీ ఎన్ని సినిమాలతో వచ్చినా ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాలనే ఆదరిస్తారు.

ఇక ఈ ఇయర్ ఎక్కువ సినిమాలు చేసిన హీరో ఎవరూ అంటే ‘సంతోష్ శోభన్’. అవును.. చాలా మంది ఏ ఆది సాయి కుమారో, కిరణ్ అబ్బవరమో అయి ఉంటాడని అనుకున్నా, ఇతగాడు వాళ్ళ కంటే రెండాకులు ఎక్కువే తిన్నాడు. అందుకే ఈ ఇయర్ వాళ్ళ కంటే ఎక్కువగా 4 సినిమాలు చేసి, ఓవరాల్ గా 2023 లో ఎక్కువ సినిమాలు చేసిన హీరో గా నిలిచాడు. ఒక్కసారి ఆ సినిమాలను గమనిస్తే.. ముందుగా

1) కళ్యాణం కమనీయం:

- Advertisement -

అనిల్ కుమార్ డైరెక్ట్ చేసిన కళ్యాణం కమనీయం సినిమాలో సంతోష్ శోభన్ హీరోగా నటించగా, 2023 సంక్రాంతికి జనవరి 13న రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకోగా సంక్రాంతి పోరులో అడ్రస్ లేకుండా పోయింది.

2). శ్రీదేవి శోభన్ బాబు:

కళ్యాణం కమనీయం ప్లాప్ తో సంతోష్ శోభన్ నిరాశ చెందకుండా నెల రోజుల గ్యాప్ తోనే మరో సినిమాతో వచ్చాడు. దిమ్మల ప్రసన్న కుమార్ డైరెక్ట్ చేసిన ‘శ్రీదేవి శోభన్ బాబు’ మూవీ లో హీరోగా నటించాడు. చిరు పెద్ద కూతురు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఫిబ్రవరి 18న విడుదలైంది. ఇక చిరంజీవి ప్రమోట్ చేసినా, ఈ సినిమా ప్లాప్ కావడం ఎవరూ ఆపలేకపోయారు.

3). అన్ని మంచి శకునములే:

ఈసారి సంతోష్ శోభన్ మంచి డైరెక్టర్ నే పట్టుకున్నాడనిపించింది. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్షన్ లో “అన్ని మంచి శకునములే” సినిమాలో సంతోష్ శోభన్ హీరోగా నటించడం జరిగింది. మే 18న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కినా బోరింగ్ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకోలేకపోయింది.

4). ప్రేమ్ కుమార్:

ఇక ఫైనల్ గా నాలుగో సారి సంతోష్ శోభన్ కామెడీని నమ్ముకొని హిట్ కొడదామని కసితో వచ్చాడు. అభిషేక్ మహర్షి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ప్రేమ్ కుమార్’ సినిమాలో సంతోష్ శోభన్ హీరోగా నటించగా, ఆగష్టు 18న రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

ఏది ఏమైనప్పటికి సంతోష్ శోభన్ నాలుగు సినిమాలతో వచ్చినా కూడా అందులో ఒక్క సినిమా కూడా సక్సెస్ ని ఇవ్వలేదు. ఇక సంతోష్ శోభన్ తర్వాత కిరణ్ అబ్బవరం మూడు సినిమాలతో పలకరించినా అతను కూడా ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు