Salaar: సలార్ కోసం రంగంలోకి రేవంత్ రెడ్డి..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్. కే.జి.ఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలిం పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ సినిమాను నిర్మించారు. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారణ్, శృతిహాసన్, జగపతిబాబు, బాబీ సింహ, టిన్ను ఆనంద్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఈనెల 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. సుమారు 400 కోట్ల రూపాయల వ్యయంతో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కింది.

అయితే ఈ సినిమా టికెట్ రేట్లను పెంచుకునేలా అనుమతి ఇవ్వాలంటూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో చిత్ర యూనిట్ చర్చలు జరుగుతుందనే విషయంపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో మల్టీప్లెక్స్ లో 450 రూపాయలు, సింగిల్ స్క్రీన్ లో 250 ఉండేలా అనుమతి ఇవ్వాలని మూవీ యూనిట్ రిక్వెస్ట్ చేసినట్లు తెలిసింది. అయితే సలార్ మూవీకి టికెట్ రేట్ పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలపై చిన్న నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

దీనివల్ల చిన్న సినిమాలను చంపి వేయడమే జరుగుతుందని వారు వాదిస్తున్నారు. అంతేకాకుండా బిఆర్ఎస్ ప్రభుత్వంలో జారీ చేసిన 120 జీవోను రద్దు చేయాలని చిన్న సినిమాల నిర్మాతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించుకుంటున్నారు. 120 జీవో ప్రకారం పరిస్థితులను బట్టి రాష్ట్రమంతటా టికెట్ రేట్లను పెంచుకునేందుకు గత ప్రభుత్వం వెసులుబాటును కలిగిస్తూ జీవోను జారీ చేసింది. అయితే ఈ 120 జీవోను రద్దు చేయాలని చిన్న నిర్మాతల సంఘం తరఫున నట్టి కుమార్ ఘాటుగా స్పందించారు. పేదవాడు తక్కువ రేటుకు సినిమా చూస్తే చిన్న నిర్మాతకు మేలు జరుగుతుందన్నారు నట్టి కుమార్.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు