NTR: ఎన్టీఆర్ పిల్లల స్కూల్ ఫీజ్ తెలిస్తే నోరెళ్ళబెట్టాల్సిందే..!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ కి ఏ రేంజ్ లో పాపులారిటీ ఉందో అందరికీ తెలిసిందే. ఆయన తెలుగు ప్రజలకే కాకుండా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ప్రపంచ స్థాయినే అందుకున్నారు.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా చలామణి అవుతున్న ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో రాబోతోంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నారు. ఇలా కెరియర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తూ మరింత సక్సెస్ అందుకుంటున్నారు ఎన్టీఆర్.

ఇక ఈయన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. లక్ష్మీ ప్రణతి అనే అమ్మాయిని పెద్దల సమక్షంలో చాలా ఘనంగా వివాహం చేసుకున్న ఎన్టీఆర్.. వీరికి అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. ఇకపోతే కూతురు పుట్టలేదన్న బాధ ఎప్పటికీ ఉంటుందని.. ఆ బాధ తమని విడిచి వెళ్ళదని గతంలో ఎన్టీఆర్ దంపతులు వెల్లడించిన విషయం తెలిసింది. ఇక ఎన్టీఆర్ తన వ్యక్తిగత జీవితాన్ని చాలా బిందాసుగా గడపడానికి ఇష్టపడతారు. ఖరీదైన కార్లు.. విలాసవంతమైన బంగ్లాలు.. వస్తువులనే ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న కొడుకుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కొడుకులకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.

ఇక అసలు విషయంలోకి వెళ్తే ఎన్టీఆర్ తన కొడుకులకు సంవత్సరానికి స్కూల్ కి ఎంత ఫీజు చెల్లిస్తారు అన్న విషయం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ ఐదవ తరగతి చదువుతుండగా… చిన్న కొడుకు భార్గవ్ రామ్ ఒకటవ తరగతి చదువుతున్నారు. ఇద్దరు కూడా హైదరాబాదులోని ఒక కార్పొరేట్ స్కూల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ఇక వీరిద్దరి చదువు కోసం ఎన్టీఆర్ ప్రతి ఏడాది అక్షరాల రూ.20 లక్షలు చెల్లిస్తున్నారట. ప్రైమరీ విద్య కోసమే ఈ రేంజ్ లో ఖర్చు చేస్తున్నారు అంటే ఇక పిల్లలు పై చదువులు వెళ్లేసరికి ఇంకా ఎంత కట్టాల్సి వస్తుందో అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ పిల్లల స్కూల్ ఫీజు తెలిసి.. కొన్ని మధ్య తరగతి కుటుంబాలు సంతోషంగా బ్రతికేస్తాయి అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip at Filmify Telugu

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు