NBK108: కాజల్ కు కండిషన్స్ పెట్టిన భర్త.. రోజుకు ఒక గంట సేపు?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కాజల్ అగర్వాల్ తన కెరీర్ ప్రారంభంలో లక్ష్మీ కళ్యాణం, చందమామ, మగధీర లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. మగధీర సినిమా తర్వాత ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్ళింది. ఇప్పుడు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కూడా అగ్ర హీరోయిన్గా కొనసాగుతోంది కాజల్ అగర్వాల్.

అయితే రెండేళ్ల కిందట అంటే దాదాపు లాక్ డౌన్ సమయంలో…. కాజల్ అగర్వాల్ పెళ్లి అయిన సంగతి తెలిసిందే. గౌతమ్ కిచ్లు అనే బడా వ్యాపారస్తున్నీ ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ కాజల్ అగర్వాల్. వీరికి ఇటీవలే ఓ బాబుకు కూడా జన్మనిచ్చింది. ఇటీవలనే ఈమె తల్లి అయినప్పటికీ… కాజల్ అగర్వాల్ వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. ఇలాంటి తరుణంలో కాజల్ అగర్వాల్ గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

పెళ్లికి ముందు కాజల్ కు ఆమె భర్త ఒక కండిషన్ పెట్టారట. ఆ కండిషన్ ఒప్పుకున్న తర్వాతే ఆమెను పెళ్లి చేసుకున్నారట. ఎన్ని సినిమాలు చేసిన అలాగే ఎంత బిజీగా ఉన్నా… ప్రతిరోజు ఒక గంట సమయం పాటు తనతో గడపాలని కాజల్ కు కండిషన్ పెట్టాడట ఆమె భర్త. లైఫ్ లో నువ్వు ఇచ్చే గిఫ్ట్ అది ఒక్కటేనని ఆమె భర్త గౌతం కండిషన్ పెట్టాడట. దీనికి ఒప్పుకున్న కాజల్… ఇప్పటికీ ఆ కండిషన్ ను జవదాటలేదట. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు