Agent: పాపాం సురేందర్ రెడ్డి చివరికి ఆ హీరోనే దిక్కయ్యాడు !

ఏజెంట్ సినిమా ఫ్లాప్ సురేందర్ రెడ్డి కెరీర్ ను దారుణమైన పరిస్థితికి తీసుకొచ్చిందని చెప్పొచ్చు. గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డి కి ఏజెంట్ డిజాస్టర్ మాత్రం ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఏజెంట్ సినిమా ఇటీవలనే రిలీజై, ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన సినిమాని అనిల్ రామబ్రహ్మం సుంకర అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాడు. అయితే కెరీర్ లో సరైన ఒక్క హిట్ సినిమా కూడా లేని అఖిల్ పై ఇంత భారీ బడ్జెట్ పెట్టడానికి మెయిన్ రీజన్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి అని చెప్పవచ్చు.

సురేందర్ రెడ్డి పై నమ్మకంతో ప్రొడ్యూసర్ ఈ సినిమాని ఎక్కడ కంప్రమైజ్ లేకుండా నిర్మించగా ఈ డైరెక్టర్ మాత్రం సినిమాపై ఎలాంటి శ్రద్ధ లేకుండా ఇష్టం వచ్చినట్టు తీసి, ఏజెంట్ సినిమా ఫ్లాప్ కు ప్రధాన కారణంగా నిలవడంతో ప్రస్తుతం ఆయన కెరీర్ ఇబ్బందుల్లో పడిపోయింది. హీరోలెవరు ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించట్లేదని తెల్సుతోంది.

- Advertisement -

అయితే ఇదివరకే ఈయన అల్లు అర్జున్ తో సినిమా చేయవలసి ఉండగా, పుష్ప తరువాత సినిమా తరువాత మళ్ళీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో కలిసి పని చేయబోతుండటంతో ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. దాంతో సురేందర్ రెడ్డి ఇటీవలనే ఉప్పెన ఫేం వైష్ణవ్ తేజ్ ను కలిసి కథ వినిపించినట్టు సమాచారం. ప్రస్తుతం ఆదికేశవ సినిమా చేస్తున్న వైష్ణవ్ తేజ్ ఈ సినిమా అనంతరం సురేందర్ రెడ్డి తో సినిమా చేయనున్నాడు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు