BRO : పవన్ కళ్యాణ్ ను చూసి బుద్ది తెచ్చుకో మహేష్- వైరల్ అవుతున్న కామెంట్స్

టాలీవుడ్ కు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లు రెండు మెయిన్ పిల్లర్స్ లాంటి వాళ్ళు అని చెప్పడంలో ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తెలుగులో ఉన్న హీరోలందరి సినిమాలు ఆడాలంటే స్టార్ డైరెక్టర్, సీనియర్ టెక్నీషియన్స్ పెద్ద ప్రొడక్షన్, భారీ పబ్లిసిటీ కావాలి కానీ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లకు మాత్రం ఇలాంటివేవి అవసరం లేదు కేవలం వాళ్ళ పేరు, స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటె చాలు బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డ్స్ క్రియేట్ అవుతాయ్.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీ గా ఉంటూనే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. అంతే కాదు ఆయన చేస్తున్న సినిమాలు దాదాపు అన్ని ఫినిషింగ్ స్టేజ్ కు కూడా వచ్చేసాయి. రేపో మాపో రిలీజ్ కూడా అవబోతున్నాయి. కానీ మహేష్ బాబు సినిమాల ధోరణి చూస్తే, పవన్ కళ్యాణ్ కు సినిమాలకు పూర్తిగా అతీతంగా ఉంది. ఆయన చేస్తున్నదే ఒక్క సినిమానే అయినప్పటికీ ఇంత వరకు ఈ సినిమా కొలిక్కి రాలేదు. ఒక ఫైట్ సిన్ తప్ప అసలు ఈ సినిమా షూటింగ్ పెద్దగా జరిగింది కూడా లేదు.అంతలోనే వెకేషన్స్ అంటూ మహేష్ విదేశాలకు వెళ్ళిపోయాడు. మహేష్ తిరిగి వచ్చేలోపు ఏకంగా ఆ సినిమా రూపు రేఖలే మార్చేశాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్

ప్రస్తుతం మహేష్ బాబు చేస్తున్న గుంటూరు కారం సినిమాని ఎంతసేపటికి సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని మేకర్స్ చెబుతున్న కూడా ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్ అయ్యే సూచనలేవి కనిపించట్లేదు. దాంతో సోషల్ మీడియాలో మహేష్ కు వ్యతిరేకంగా కామెంట్స్ రావడం మొదలయ్యాయి. చేస్తున్న ఒక్క సినిమాకి కూడా ఇంత జాప్యం ఎందుకని ఆయనకు విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను చూసి బుద్ది తెచ్చుకో అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ వాటిని వైరల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ స్టేట్మెంట్స్ ఎవరు చేస్తున్నారో క్లారిటీ లేకపోయినప్పటికీ ఈ టాపిక్ మాత్రం ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు