Vaishnavi: ఆ దర్శకుడి చేతిలో బేబీ.. ఇక దశ తిరిగినట్టే?

టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ల ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని తెలిసిందే. అడపాదడపా అంజలి లాంటి హీరోయిన్లు కొంతకాలం రాణించడం తప్ప తెలుగు హీరోయిన్లకు అంతగా ఛాన్సులు రావడం అరుదు. కానీ ఒక్క ఛాన్స్ వస్తే తమని తనము నిరూపించుకుంటామని ఆనంది, ప్రియాంక జవాల్కర్ లాంటి హీరోయిన్లు పలు ఇంటర్వ్యూ లలో చెప్తూ ఉండడం గమనించాం. ఇక అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓవర్ నైట్ ఫేమస్ అయిన తెలుగు పిల్ల ‘వైష్ణవి చైతన్య’.

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫేమస్ అయిన ఈ అమ్మాయి ‘బేబీ’ అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ కొట్టి ఇండస్ట్రీ మొత్తం తిరిగి చూసేలా చేసింది. ఇక ఈ అమ్మాయికి లేటెస్ట్ గా వచ్చిన మూవీ ఆఫర్ తో షాక్ అయ్యారు నెటిజన్లు. ప్రముఖ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం చేయబోయే తర్వాతి సినిమాలో వైష్ణవి ని హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఈ విషయాన్నీ ఈ అమ్మాయి బర్త్ డే స్పెషల్ గా విష్ చేస్తూ మేకర్స్ తెలియచేయడం జరిగింది.

అయితే దర్శకుడిగా బొమ్మరిల్లు భాస్కర్ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తీసినవి తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్ చేసాయి. ఆరెంజ్ లాంటి సినిమా కూడా అప్పట్లో ప్లాప్ అయినా, ఆ తర్వాత రీ రిలీజ్ అయ్యి ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. ఇక రెండేళ్ల కింద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో హిట్ కొట్టిన ఈయన ప్రస్తుతం SVCC బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో బేబీ భామ వైష్ణవి ని హీరోయిన్ గా తీసుకుంటున్నట్టు తెలిసింది.

- Advertisement -

ఇక బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల్లో హీరో కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, హీరోయిన్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. భాస్కర్ సినిమాలు హిట్ అయినా ప్లాప్ అయినా హీరోయిన్ పాత్రలకు మంచి క్యారెక్టరైజేషన్ వస్తుంది. అందుకే అన్ని కుదిరితే వైష్ణవి చైతన్య కు ఇది టర్నింగ్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ సినిమా క్యాస్టింగ్ గురించి ఇంకా వివరాలు రావాల్సి ఉంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు