SPY: ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా..?

కార్తికేయ2 సినిమా ద్వారా పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్ హీరోగా ఎడిటర్ గ్యారీ డైరెక్షన్లో రూపొందిన స్పై సినిమా జూన్ 29న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. హీరోకి నిర్మాతకి మధ్య విభేదాలు రావటంతో వాయిదా పడుతుందని భావించిన ఈ సినిమా ఎట్టకేలకు అనౌన్స్ చేసిన డేట్ కి రిలీజ్ అవుతుంది. కార్తికేయ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత వస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

అయితే, అంచనాలు ఉన్నంత రేంజ్ లో ఈ సినిమాకి బయట రాష్ట్రాల్లో థియేటర్లు దక్కలేదు. తెలుగు రాష్ట్రాల్లో తప్ప అటు హిందీలో కానీ, తమిళ్ లో కానీ, ఆశించిన రేంజ్ లో బిజినెస్ జరగలేదు. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ కూడా బయట పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయలేదు. గతంలో కార్తికేయ2 సినిమాని కూడా ఇలా నామమాత్రంగానే రిలీజ్ చేయగా సినిమాకి పాజిటివ్ టాక్ రావటంతో వర్డ్ ఆఫ్ మౌత్ కారణంగా పాన్ ఇండియా హిట్ అయ్యింది.

ఇప్పుడు స్పై సినిమా విషయంలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఆశిస్తోంది సినిమా యూనిట్. నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అభినవ్ గోమతం, మకరంద్ దేశ్ పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. మరి, భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా నిఖిల్ కి మరొక పాన్ ఇండియా హిట్ ఇస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు