Megastar: ఆ హీరోయిన్ మళ్లీ ఛాన్స్ ఇచ్చిన చిరు – ఆ విషయం మరచిపోయాడా..?

సినిమాల విషయంలో కాంబినేషన్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. ఒకసారి కలిసి పని చేసిన టెక్నీషియన్స్ ని నటీనటులను రిపీట్ చేయటం సర్వ సాధారణమైన విషయం. అలా రిపీట్ అయిన కాంబినేషన్స్ కొన్ని సార్లు వర్కౌట్ అవుతూ ఉంటాయి,కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం అలాంటి కాంబినేషన్ ఒకటి రిపీట్ అవుతోంది, స్టాలిన్ సినిమాలో కలిసి నటించిన మెగాస్టార్ చిరంజీవి, చెన్నై భామ త్రిష మళ్ళీ కలిసి నటించనున్నారు. ప్రస్తుతం మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళాశంకర్ సినిమాలో నటిస్తున్న చిరు, ఆ తర్వాత చేయబోయే సినిమాలో హీరోయిన్ గా త్రిష పేరుని పరిశీలిస్తున్నాడని సమాచారం అందుతోంది.

సాధారణంగా హీరోలతో పోలిస్తే, హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ అని చెప్పాలి. అలాంటిది 20ఏళ్లకు పైగా హీరోయిన్ గా ఉండటం త్రిష లాంటి కొద్దీ మందికే సాధ్యమయ్యిందని చెప్పాలి. ఇటీవల వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో త్రిష అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వయసు పెరిగే కొద్దీ త్రిష అందం రెట్టింపవుతోందని కామెంట్స్ వచ్చాయి.

ఈ నేపథ్యంలో చిరు సినిమాలో త్రిష నటిస్తోందన్న వార్తలు రావటంతో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అదేంటంటే, ఆచార్య సినిమా సమయంలో మొదట త్రిషని హీరోయిన్ గా తీసుకోవటం ఆ తర్వాత టెక్నీకల్ డిఫరెన్సెస్ వల్ల త్రిష ఆ సినిమా నుండి తప్పుకోవడంతో చిరు, త్రిషల మధ్య వచ్చిన మనస్పర్థలు క్లియర్ అయినట్టే అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. మరి, చాలా కాలంగా తెలుగులో స్ట్రైట్ సినిమా చేయని త్రిష ఈ సినిమాతో టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు