Rakshith Shetty: సోలోగా వస్తుంది! క్లిక్ అయితే మరో కాంతారా!

Rakshith Shetty:

టాలీవుడ్ లో ఈ వారం పెద్దగా తెలుగు సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. ఎదో ఆడియన్స్ కి తెలియని రెండు చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, తప్ప ప్రేక్షకులకి తెలిసిన నటీనటుల సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. కానీ ఒక డబ్బింగ్ సినిమా మాత్రం సడన్ గా ఆడియన్స్ ముందుకు వస్తుంది. ఆ సినిమాయే “సప్త సాగరాలు దాటి”. కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి నటించిన ఈ సినిమా కన్నడలో సెప్టెంబర్1 న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది.

లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా లో కథ ఏమి కొత్తగా లేకపోయినా, ఒక ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీ గా తెరకెక్కి యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఇప్పటికే కర్ణాటకలో 50కోట్లకి వసూలు చేసి సక్సెస్ ఫుల్ గా ఇంకా రన్ అవుతున్న ఈ సినిమా తెలుగులో సెప్టెంబర్ 22న రిలీజ్ అవుతుంది. రక్షిత్ శెట్టి చిత్ర యూనిట్ తో కలిసి ఈ మధ్యే ప్రమోషన్స్ కూడా చేసారు. అన్నీ కలిసొచ్చి సప్త సాగరాలు దాటి సినిమాకి మంచి టాక్ వస్తే సినిమా కాంతారా లాగే హిట్ అయ్యే అవకాశం ఉంది.

లాస్ట్ ఇయర్ కూడా కూడా కాంతారా ఏ అంచనాలు లేకుండా సడన్ గా వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమాని కూడా ముందు కన్నడ లో రిలీజ్ చేశాకే తెలుగులో డబ్ చేసారు. ఇక సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో రిలీజ్ చేస్తున్న ఈ సినిమా తెలుగులో తక్కువ బిజినెస్సే చేసినప్ప్పటికీ, , పోటీ లో కాకుండా సోలో గా రిలీజ్ అవుతుంది కాబట్టి, కంటెంట్ బాగుంటే బయ్యర్లకి లాభాలు కురిపిస్తుందని చెప్పాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు