Rakshith Shetty: కన్నడ క్లాసిక్ తెలుగులోనూ కల్ట్ గా నిలుస్తుందా?

Rakshith Shetty:

టాలీవుడ్ లో గత కొన్ని నెలలుగా డబ్బింగ్ సినిమాల హవాయే నడుస్తుంది. తెలుగు స్టార్ హీరోల సినిమాలకు పోటీగా రిలీజ్ అయ్యి మరి ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు అవుతున్నాయి. ఈ క్రమంలోనే కన్నడలో రీసెంట్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన ఒక సినిమా తెలుగు ఆడియన్స్ ని మెప్పించడానికి మన ముందుకు రాబోతుంది. కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి హీరోగా, రుక్మిణి హీరోయిన్ గా నటించిన కన్నడ లవ్ స్టోరీ, తెలుగులో “సప్త సాగరాలు దాటి” అన్న పేరుతో రిలీజ్ అవుతుంది.

రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేయగా, మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని చిత్ర యూనిట్ చెప్పడం జరిగింది. కథ విషయానికి వస్తే రెగ్యులర్ గా చూసే లవ్ స్టోరీస్ లా కాకుండా డిఫరెంట్ గా ఉంటుంది. ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకుందామని అనుకున్న టైం లో హీరో అనుకోకుండా ఒక కేసులో చిక్కుకుని జైలుకి వెళ్తాడు. అప్పట్నుంచి హీరో, హీరోయిన్లు కలవాలని ఎన్ని సార్లు ప్రయత్నించినా విడిపోతారు. ఈ క్రమంలో వీళ్లిద్దరు ఎదురవుతున్న సమస్యల నుండి ఎలా పోరాడి కలుస్తారా లేదా అనేదే కథ.

- Advertisement -

కథ ప్రకారం చిన్నదే అయినా, దాన్ని దర్శకుడు ఎమోషన్స్ తో అద్భుతంగా తెరకెక్కించాడని తెలుస్తుంది. ఇప్పటికే కన్నడ వెర్షన్ చూసిన కొందరు ప్రేక్షకులు, తెలుగు రిలీజ్ కోసం కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ సినిమా రెండు పార్ట్ లుగా తీయబడింది. మొదటి పార్ట్ కన్నడ లో ఇప్పటికే రిలీజ్ చేయగా, ఇప్పుడు తెలుగులోను రిలీజ్ చేస్తున్నారు. ఇక రెండో పార్ట్ ని అక్టోబర్ 20న రిలీజ్ చేయడం జరుగుతుంది.

“ఇక సప్త సాగరాలు దాటి” సినిమాకి ‘సైడ్ A’ అని ఉపశీర్షిక పెట్టగా, రెండో పార్ట్ గా సైడ్ B అని వస్తుంది. సెప్టెంబర్ 22న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కన్నడలో బ్లాక్ బస్టర్ అయినట్టు తెలుగులో కూడా హిట్ అవుతుందా లేదా చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు