ANR100Years: అతిరథ, మహారథుల మధ్య ఘనంగా జరిగిన ANR 100ఇయర్స్ సెలెబ్రేషన్స్..

ANR100Years:

టాలీవుడ్ లెజెండరీ నటులు నట శిఖరం శ్రీ అక్కినేని నాగేశ్వరరావు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేవదాసైనా, కాళిదాసైనా, నటనకి పెట్టింది పేరు. భక్తుడిగా, భగ్న ప్రేమికుడిగా తెలుగు ప్రజల ఆదరాభిమానాలను పొందిన మహా నటుడాయన. తెలుగు చిత్ర పరిశ్రమని హైదరాబాద్ కి తీసుకు వచ్చి అన్నపూర్ణ ఫోటో స్టూడియోస్ స్థాపించి ఎంతో మందికి ఉపాధిని కల్పించిన ఆయన ఏడు దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమలో నటుడిగా కొనసాగారు.

 

Image

- Advertisement -

Image

Image

 

ఈ రోజు అనగా సెప్టెంబర్ 20 ఆ మహానటులు అక్కినేని నాగేశ్వర రావు శత జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన శత జయంతి ఉత్సవాలు అన్నపూర్ణ స్టూడియో లో ఘనంగా జరిగాయి. అక్కినేని కుటుంబ పర్యవేక్షణలో అతిరథ, మహారథుల మధ్య జరిగిన ఈ వందేళ్ల వేడుక కి సినీ, రాజకీయ ప్రముఖులు ఎంతో మంది హాజరయ్యి జయంతిని గౌరవప్రదం చేసారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన భారత మాజీ ఉపరాష్ట్రపతి రఘుపతి వెంకయ్య నాయుడు ANR విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఇక సినీ హీరోలు సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, న్యాచురల్ స్టార్ నాని తో పాటు, దర్శక, నిర్మాతలు రాజమౌళి, అల్లు అరవింద్, ప్రముఖ నటులు మురళి మోహన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, అనూప్ రూబెన్స్, జగపతి బాబు, తదితరులు హాజరయ్యారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు