Bigboss7: డీసెంట్ ఎంటెర్టైన్మెంట్ ప్లేయర్ అఫ్ ది వీక్.. శుభశ్రీ!

Bigboss7:

మాటీవీ లో బిగ్ బాస్ సీజన్ 7 ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది. ఇప్పటివరకు ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవగా, ప్రస్తుతం 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో శివాజీ మినహా అందరూ యంగ్ ప్లేయర్స్ కావడం గమనార్హం. అందువల్ల ఎవరు సర్దుకోకుండా, ఎవరికీ ఎవ్వరూ తగ్గకుండా పోటీ పడుతున్నారు. ఒక రకంగా పోటీ పడుతున్నారు అనడం కంటే గొడవలు కూడా పడుతున్నారు అనవచ్చు. ప్రతి చిన్నదానికి తమ మాటే నెగ్గాలనుకోవడం ఒకరి మాటైతే, మరొకరు తమకు బిగ్ బాస్ అన్యాయం చేస్తున్నారని, ఇంకొకరు బిగ్ బాస్ టీమ్ లో తామే బెస్ట్ ప్లేయర్స్ అని అంటూ ఆడుతున్నారు.

అయితే ప్రస్తుతం ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో అందరూ బాగా ఆడుతున్నా జెన్యూన్ గా ఆడుతున్న ప్లేయర్ యావర్ అని చాలా మంది ఆడియన్స్ అభిప్రాయం. అయితే అందరి కన్నా డీసెంట్ గా గేమ్స్ ఆడుతూ మెల్లి మెల్లిగా ఆడియన్స్ దృష్టిలో నిలుస్తున్న కంటెస్టెంట్స్ శుభశ్రీ..

అవును. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చినపుడు ఈమె కూడా చాలా మందికి తెలియదు. యావర్ లాగే ఈమెకు తెలుగు పెద్దగా తెలియదు. అయితే కంటెస్టెంట్స్ అందరితో సరదాగా ఉంటూ, ఎవ్వరితోనూ గొడవలు పడకుండా ఆడియన్స్ దృష్టిలో డీసెంట్ ప్లేయర్ అనిపించుకుంది. పైగా సందీప్ పవర్ అస్త్ర తానే దొంగిలించిన సందీప్ ఏమి అనలేదంటే తన ప్రవర్తన నచ్చే అని చెప్పొచ్చు.

- Advertisement -

ఇక తాజాగా 17వ రోజు ఎపిసోడ్ లో రతిక ప్రశాంత్ గొడవపడుతుంటే ఆపడానికి శత విధాలా ప్రయత్నించింది. ఈ క్రమంలో ప్రశాంత్ ఒక మాట అన్నా సరదాగా తీసుకుంది. ఇక ఆ మాట పై శివాజీ దొడ్డికి బోయే చెంబు అంటూ కామెడీ చేయగా, దానికి అర్ధం తెలుసుకోవడానికి శుభశ్రీ ట్రై చేయడం ఆడియన్స్ కి చాలా నవ్వు తెప్పించింది. శుభశ్రీ ఇలాగే ఆడితే ఆటలో పెద్గగా పెర్ఫార్మ్ చేయకున్నా చాలా రోజులు ఉండే అవకాశం ఉంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు