ANR: నందమూరి వారి సందడి ముగిసింది – ఇప్పుడు అక్కినేని వారి వంతు..!

విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలు ఇటీవల ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు సినీప్రముఖులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను గ్రాండ్ సక్సెస్ చేశారు. తెలుగు సినీ చరిత్రలో రామారావుతో సమాన స్థానం ఉన్న అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి కూడా దగ్గరలోనే ఉన్న నేపథ్యంలో అక్కినేని కుటుంబం కూడా ఆయన శతజయంతి ఉత్సవాలను ఘనంగా జరపాలని సన్నాహాలు చేస్తున్నారట. ఈ విషయంలో నాగార్జున ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని సమాచారం అందుతోంది. 2024లో ఏఎన్నార్ శతజయంతి రానుండగా అందుకు 6నెలలకి ముందే ఉత్సవాలు మొదలు పెట్టాలని భావిస్తున్నారట నాగార్జున.

నాగేశ్వరావు నటించిన సినిమాలను ఇరు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున థియేటర్లలో ప్రదర్శించటం, ఫోటో ఎక్జిబిషన్, ఫిలిమ్ ఫెస్టివల్, ఫ్యాన్ క్లబ్ మీటింగ్స్ వంటివి ప్లాన్ చేస్తున్నారట. అక్కినేని కుటుంబం నుండి మూడో తరం అయిన నాగచైతన్య, అఖిల్ కూడా హీరోలుగా సెటిల్ అయిన తరుణంలో వస్తున్న ఏఎన్నార్ శతజయంతి ఉత్సవాలు ప్రత్యేకంగా నిలువనున్న నేపథ్యంలో నాగార్జున ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అనుకుంటున్నారట.

అయితే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు కేవలం కుటుంబసభ్యుల తరఫున, పార్టీ తరఫున మాత్రమే నిర్వహించారు కానీ, టాలీవుడ్ తరఫున అధికారికంగా ఉత్సవాలు నిర్వహించలేదు. ఇది అభిమానుల్లో ఒకింత నిరాశకు దారి తీసింది. ఈ నేపథ్యంలో నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలైనా ఇండస్ట్రీ తరఫున అధికారికంగా నిర్వహిస్తారా లేదా అన్న చర్చ మొదలైంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు