Vijay Antony: ఆమెతో పాటు నేను కూడా చనిపోయా – విజయ్ ఆంటోనీ ఎమోషనల్ నోట్..!

Vijay Antony

విజయ్ ఆంటోని కూతురు సూసైడ్ అందరినీ కలిచి వేస్తోంది. పదహారేళ్ళ వయసులో డిప్రెషన్ కి గురై ఆత్మహత్య చేసుకోవటంతో కోలీవుడ్ తో పాటు  ఇండియన్ ఫిలిం సర్కిల్స్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కూతురి మరణాన్ని తట్టుకోలేకపోయిన విజయ్ ఆంటోని ఎమోషనల్ నోట్ రిలీజ్ రిలీజ్ చేశాడు.
” నా కూతురు చాలా ప్రేమగా దైర్యంగా ఉంటుంది.కులం, మతం, డబ్బు, అసూయా, బాధ, పేదరికం మరియు ద్వేషం లేని ఈ ప్రపంచం కంటే మెరుగైన ప్రశాంతమైన ప్రదేశానికి ఆమె వెళ్ళింది, ఆమె నాతో మాట్లాడుతోందని” చెప్పుకొచ్చాడు. ఆమెతో పాటు నేను కూడా చనిపోయానంటూ ఎమోషనల్ అయ్యాడు విజయ్ అంటోని.
” నేను ఇప్పుడు ఆమె కోసం సమయాన్ని వెచ్చిస్తున్నాను, ఇక మీదట నేను చేయబోయే ప్రతి మంచి పని తన పేరు మీదనే ప్రారంబిస్తానని వెల్లడించాడు విజయ్. తన కూతురి మీద విజయ్ కి ఎంత ప్రేమ ఉందో, ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక ఎలా బాధపడుతున్నాడో ఈ పోస్ట్ ద్వారా అర్థం చేసుకోవచ్చు.
విజయ్ ఆంటోనికి జరిగిన నష్టం పట్ల కోలీవుడ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. లియో సినిమా నుండి రిలీజ్ కావాల్సిన అప్డేట్ ని కూడా వాయిదా వేసింది సినిమా యూనిట్. తనకు జరిగిన నష్టం నుండి విజయ్ ఆంటోని త్వరగా కోలుకొని మాములు మనిషి అవ్వాలని ఫ్యాన్స్ సహా ఆడియెన్స్ కోరుకుంటున్నారు.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు