Venkatesh : పవన్ బాటలో ?

టాలీవుడ్ లో ప్రస్తుత హీరోల్లో ఎక్కువ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో అంటే వెంటనే గుర్తు వచ్చే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రీ ఎంట్రీ తర్వాత పవన్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. పవర్ స్టార్ చేస్తున్న లిస్ట్ లో ఉన్న సినిమాల్లో వినోదయ సీతం తెలుగు రీమేక్ ఒకటి. ఈ సినిమాలో పవన్ దేవుడి పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. కాగా పవన్ ఇప్పటికే గోపాల గోపాల సినిమాలో దేవుడి పాత్ర చేశాడు.

ఇదిలా ఉండగా, పవన్ స్నేహితుడు విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం పవర్ స్టార్ నే ఫాలో అవుతున్నాడు. పవన్ లాగే వెంకీ మామ కూడా దేవుడి పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత విశ్వక్ వరుసగా మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి ఓరి దేవుడా..!

ఓరి దేవుడా..! మ్యారేజెస్‌ ఆర్‌ మేడిన్‌ హెవెన్‌ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా వస్తుంది. తమిళంలో వచ్చిన ఓమై క‌డువ‌లే అనే సినిమాకు ఇది తెలుగు రీమేక్. ఒరిజ‌నల్ వెర్ష‌న్‌ను తెర‌కెక్కించిన అశ్వత్ మ‌రిముత్తు, ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. మన జీవిత భాగస్వామి ఎవరో ముందే రాసిపెట్టి ఉంటుంది. ఈ కాన్సెప్ట్ తోనే ఓరి.. దేవుడా..! అనే సినిమా వస్తుంది.

- Advertisement -

పెళ్లి కష్టాలు భరించలేక పారిపోవాలనే ప్రయత్నం చేసే హీరో కష్టాలను కామెడీ రూపంలో ఈ సినిమాలో చూపించనున్నారు. సినిమాలో దేవుడి పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. తమిళంలో విజయ్ సేతుపతి దేవుడి పాత్రలో కనిపించాడు. ఇప్పుడు తెలుగు విక్టరీ వెంకటేష్ దేవుడి పాత్రలో నటిస్తున్నాడు. దీనికి కోసం వెంకీ మామ ఇప్పటికే డేట్స్ కూడా ఇచ్చాడని టాక్. అతి త్వరలోనే వెంకీ పాత్ర పై షూటింగ్ జరగనుందని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు