Allu Arju: సంయుక్తను వదలని త్రివిక్రమ్.. ఈసారి కూడా..?

కేరళ కుట్టి, ప్రస్తుతం గోల్డెన్ లెగ్ గా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలుగుతున్న హీరోయిన్.. సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీని దక్కించుకుంది సంయుక్త. ఈ మలయాళీ ముద్దుగుమ్మ తెలుగులో భీమ్లా నాయక్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత బింబిసార, సార్ వంటి చిత్రాలలో నటించి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది.

ఇక తాజాగా సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విరూపాక్ష సినిమాలో నటించి ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. అందంతోపాటు అభినయంతోనూ ఆకట్టుకుంటున్న సంయుక్తకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. వరుసగా 4 హిట్లు చేరి లక్కీ హీరోయిన్ అన్న ట్యాగ్ తోడు కావడంతో స్టార్ హీరోలు, దర్శకులు ఆమె వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మొదట్లో హీరోయిన్స్ ని రిపీట్ చేయని త్రివిక్రమ్ శ్రీనివాస్ తన నెక్స్ట్ మూవీలో మరోసారి సంయుక్తనే తీసుకోవాలని డిసైడ్ అయ్యారట.

ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబుతో SSMB26 సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దీని తరువాత త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబోలో ఒక సినిమా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాని మేకర్స్ అధికారికంగా కూడా ప్రకటించారు. అయితే ఈ చిత్రంలో బన్నీ సరసన హీరోయిన్ గా సంయుక్తని ఫైనల్ చేసినట్లు ప్రస్తుతం టాక్ నడుస్తుంది. ఇదే నిజమైతే సంయుక్తకి తక్కువ సమయంలోనే ఐకాన్ స్టార్ లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కిందని చెప్పొచ్చు. ఈ సినిమా ఫిక్స్ అయితే టాలీవుడ్ లో ఈ మలయాళీ బ్యూటీకి తిరుగుండదు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు