Custody: నాగ చైతన్య నాకు సక్సెస్ ఇవ్వలేదు.. కృతి శెట్టి షాకింగ్ ఆన్సర్

టాలీవుడ్ హీరోయిన్, బేబమ్మ కృతి శెట్టి గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈమె మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని ఆ తరువాత నాని శ్యామ్ సింగరాయ్, నాగ చైతన్య బంగార్రాజు సినిమాలలో నటించి హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుంది. ఇక ఈమె ఇటీవల నటించిన వారియర్, మాచర్ల నియోజకవర్గం సినిమాలు ఓకే అనిపించుకున్నాయి. ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే కృతి శెట్టికి మంచి  హిట్ సినిమాలు పడడంతో అంతా ఆమెను గోల్డెన్ లెగ్ అంటూ పొగిడేశారు.

అయితే ఏమైందో తెలియదు కానీ ఆ తర్వాత కథల ఎంపిక విషయంలో తప్పటడుగులు వేసింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల వరుసగా హ్యాట్రిక్ ఫ్లాప్ లను చవిచూసింది. ఇక ప్రస్తుతం మరోసారి నాగచైతన్యతో కలిసి కస్టడీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది కృతి శెట్టి. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. అలాగే తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ మరియు అరవింద్ స్వామి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రం మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచింది చిత్ర బృందం. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఆసక్తికర సమాధానం ఇచ్చింది కృతి శెట్టి. “ఉప్పెన తర్వాత మీకు ఉప్పెనలా అవకాశాలు వెళ్లువేత్తాయి.. కానీ అలాంటి విజయం మాత్రం మీకు అందలేదు. మళ్లీ మీకు సక్సెస్ ఇచ్చింది నాగచైతన్య సినిమానే.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి కస్టడీతో మరో సక్సెస్ వస్తుందని భావిస్తున్నారా..?” అని ఓ రిపోర్టర్ అని ప్రశ్న వేశాడు.

- Advertisement -

దీనికి కృతి శెట్టి తనదైన శైలీలో సమాధానం ఇచ్చింది. డైరెక్ట్ గా నాగ చైతన్య తోనే.. ” మీరు నాకు సక్సెస్ ఇచ్చారా..? అని అడిగేసింది. దీనికి నాగ చైతన్య.. లేదు.. నీ హార్డ్ వర్క్ నీకు సక్సెస్ ని అందించిందని చెప్పుకొచ్చారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు