Malvika Nair: ఆ డైరెక్టర్ ని ఉంచుకుంటా అంటున్న మాళవిక..!

మాళవిక నాయర్, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా ద్వారా తెలుగు తెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ కమర్షియల్ సినిమా హీరోయిన్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలోనే ఎంచుకుంటూ తన ప్రత్యేకత చాటుతోంది. తన నటనకు మంచి ప్రశంసలే వచ్చినప్పటికీ సరైన హిట్ అందుకోలేక పోవటం వల్ల స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ సంపాదించలేకపోయింది. ప్రస్తుతం సంతోష్ శోభన్ సరసన హీరోయిన్ గా నటించిన ‘అన్నీ మంచి శకునములే’ సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు రానున్న మాళవిక ఆ సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటోంది.

మే 18న విడుదలకి సిద్ధంగా ఉన్న ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించగా రావు రమేష్, నరేష్, వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. మంచి ఫీల్ గుడ్ కథతో ఫ్రెష్ ఫీల్ ఇస్తున్న ఈ సినిమా ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలు పెంచుతోంది. సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న మాళవిక వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో కలిసి మెట్లు దిగుతున్న ఆ వీడియోలో మాళవిక ‘నిన్ను ఉంచుకుంటా అబ్బాయి’ అంటూ అనటం అనుదీప్ సిగ్గుపడతాడు. తన ఆ ఇన్స్టాగ్రామ్ ద్వారా మాళవిక ఆ వీడియో పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యింది.

తెలుగులో నటించిన తోలి సినిమా నుండే సొంతంగా డబ్బింగ్ చెప్తున్న మాళవిక ‘ఉంచుకుంటా’ అన్న పదానికి అర్థం తెలిసి అందా, తెలియక అందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. ప్రమోషన్ కోసం చేసినట్టు అనిపిస్తున్న ఆ వీడియో నెట్టింట ఫన్ జెనరేట్ చేస్తోంది. మరి, మాళవిక ఈ సినిమాతో అయినా హిట్ అందుకొని తెలుగులో వరుస ఆఫర్లతో బిజీ అవుతుందో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు