Private Jet: ప్రైవేట్ జెట్ కలిగి ఉన్న స్టార్ సెలబ్రిటీస్ వీళ్లే..!

బాహుబలి సినిమాతో సౌత్ ఇండియన్ సినిమాలు.. అన్ని హద్దులను చెరిపేసాయి. అలాగే భాషా అవరోధాలను కూడా అధిగమించాయి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సౌత్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. చెప్పాలంటే ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిలిం స్టార్స్ ఇండియన్ సినిమాని ఒక ఊపు ఊపుతున్నారు అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే అసలు ఈ సౌత్ హీరోల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలని ప్రజలు కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుల మాదిరిగానే సౌత్ సినీ స్టార్స్ కూడా ఖరీదైన కార్లు.. విలాసవంతమైన బంగ్లాలతో ఊహించని జీవితాన్ని గడుపుతున్నారు. అంతేకాదు వీరిలో కొంతమందికి ప్రత్యేకంగా ప్రైవేట్ జెట్ కూడా ఉంది. ఇకపోతే ప్రత్యేక విమానం కలిగి ఉన్న దక్షిణ భారతీయ నటుల గురించి ఇప్పుడు చూద్దాం.

జూనియర్ ఎన్టీఆర్:
రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ తో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్నారు ఎన్టీఆర్. అలాగే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా కలిసి నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివతో దేవర అనే సినిమా చేస్తున్నారు. ఈయన భారీ ఆస్తులతో పాటు 8 కోట్ల రూపాయల విలువైన ప్రైవేట్ విలాసవంతమైన విమానాన్ని కలిగి ఉన్నారు.

రామ్ చరణ్:
ఈయన కూడా ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచ స్థాయి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. ఇక రామ్ చరణ్ కి కూడా ఒక సొంత విమానం ఉంది.

- Advertisement -

ప్రభాస్:
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈయన కూడా ప్రైవేట్ విమానాన్ని కలిగి ఉన్నారు.

అల్లు అర్జున్:
పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా ప్రజల హృదయాలను దోచుకున్న అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఈ సినిమాకు అవార్డు కూడా అందుకున్నారు. ఇక ఈయన ఇటీవల 6 సీట్ల ప్రైవేట్ విమానాన్ని కొనుగోలు చేశారు.

నయనతార:
కేవలం హీరోలే కాదు హీరోయిన్లు కూడా ఈమధ్య సొంత విమానాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార తన భర్త ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో కలిసి ఒక ప్రైవేట్ విమానాన్ని కొనుగోలు చేశారు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు