Nithin: రష్మిక కెరీర్ పై భారీ దెబ్బ కొడుతున్న మేనేజర్..?

ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉంది హీరోయిన్ రష్మిక మందన్న. యానిమల్, పుష్ప 2 తో పాటు పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే కొన్ని వారాల క్రితం వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ – రష్మిక కాంబోలో రెండవ చిత్రానికి అనౌన్స్మెంట్ వచ్చింది. గతంలో ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన భీష్మ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఏమైందో తెలియదు కానీ.. ఇటీవల ఈ మూవీ నుండి రష్మిక తప్పుకున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇందుకు కారణం డేట్స్ కుదరలేదని సాకులు చెబుతున్నారనే టాక్ వినిపిస్తుంది. కానీ ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా నుండి తప్పుకోవడానికి ఆమె మాజీ మేనేజర్ కిరణ్ కారణం అంటూ ఫిలింనగర్ వర్గాలలో ఓ టాక్. వీరిద్దరి మధ్య విభేదాలు మొదలైనప్పటినుండి మాజీ మేనేజర్ రష్మిక గురించి దర్శక నిర్మాతల వద్ద వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టాడట. ఆమెకి టాలీవుడ్ పై పెద్దగా ఆసక్తి లేదని, ఆమె దృష్టి అంతా బాలీవుడ్ పైనే ఉందంటూ ప్రచారం మొదలుపెట్టాడని టాక్.

అంతేకాదు రష్మికకి ప్రత్యామ్నాయంగా ఇతర హీరోయిన్ల పేర్లను మేకర్స్ దగ్గర ప్రస్తావిస్తున్నాడట ఆమె మాజీ మేనేజర్. దీంతో ఈ విషయం రష్మిక దృష్టికి రావడంతో ఆమె స్వయంగా నితిన్ సినిమా నుండి తప్పుకున్నట్లు వినిపిస్తోంది. ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ రూమర్స్ లో నిజం ఎంతుందో తెలియాలంటే రష్మిక స్పందించాల్సిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు