Jawan: నయనతార భర్తకు షారుక్ ఖాన్ స్ట్రాంగ్ వార్నింగ్..!

సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద క్యూట్ కపుల్ గా పేరు సంపాదించుకున్న నయనతార – విగ్నేష్ శివన్ ల జంట ఎంత చూడముచ్చటగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నయనతార – విగ్నేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2017లో “నానుమ్ రౌడీ థాన్” సినిమా సెట్స్ లో తొలిసారి విగ్నేష్ – నయన్ కలుసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

ఆ తర్వాత చాలా కాలం పాటు డేటింగ్ చేసి.. 2021 లో నయనతారకు నిశ్చితార్థ ఉంగరం తొడిగారు విగ్నేష్. ఇక 2022 జూన్ 9న మహాబలిపురం దగ్గరలోని ఓ రిసార్ట్ లో పెద్దల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. అనంతరం సరోగసి ద్వారా 2022 అక్టోబర్ 9న కవల మగ పిల్లలను పొందారు. ఇదిలా ఉంటే.. నయనతార ప్రజెంట్ నటిస్తున్న సినిమా జవాన్. స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించారు. అయితే ఇటీవల విడుదలైన జవాన్ ప్రివ్యూ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఈ క్రమంలో నయనతార భర్త విగ్నేష్.. సోషల్ మీడియా వేదికగా జవాన్ మూవీ టీమ్ కి విషెస్ తెలుపుతూ ఓ నోట్ షేర్ చేశాడు.

అయితే ఈ స్పెషల్ నోట్ కి షారుఖ్ ఖాన్ రిట్వీట్ చేస్తూ రిప్లై ఇచ్చాడు. “విగ్నేష్ శివన్ మా సినిమాపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. నయనతార చాలా టాలెంటెడ్ యాక్టర్స్. అయితే నేను మాత్రం మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయేది మీకు ముందే తెలుసు అనుకుంటా..! కానీ జాగ్రత్త. ఆమె ఇప్పుడు కొన్ని భారీ కిక్స్, పంచ్ లు నేర్చుకుంది. సో జాగ్రత్తగా ఉండు బ్రదర్” అని ఫన్నీగా విగ్నేష్ శివన్ కి వార్నింగ్ ఇచ్చాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు