Salaar: ఆ బ్యానర్ లో ఫస్ట్ డిజాస్టర్.. ఇదే అవుతుందని ఊహించలేదు.

హోంబలే ఫిల్మ్స్.. కెజిఎఫ్ సినిమాతో ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించి ఇండియన్ బిగ్ ప్రాజెక్ట్ బ్యానర్ లలో ఒకటి గా నిలిచింది. మొదట కన్నడ సినిమాలను మాత్రమే నిర్మించిన ఈ ప్రొడక్షన్ బ్యానర్ ఇప్పుడు ఇండియా అంతటా ఇతర భాషల్లోనూ సినిమాలు నిర్మిస్తుంది. ఇప్పటికే తెలుగులో ప్రభాస్ నటిస్తున్న “సలార్” నిర్మిస్తున్న ఈ బ్యానర్ తమిళ్ లో రఘు తాత అనే సినిమాను కూడా నిర్మిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మాత అయిన విజయ్ కిరగందూర్ తాను ఏ సినిమా నిర్మించినా ఖర్చుకు వెనకాడకుండా చాలా రిచ్ గా తెరకెక్కిస్తారు. అందుకే ఈ బ్యానర్ లో వచ్చిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

అయితే తాజాగా ఈ బ్యానర్ నుండి వచ్చిన ఒక ప్రతిష్టాత్మక చిత్రం డిజాస్టర్ అవడంతో హోంబలె ఫిల్మ్స్ విజయ పరంపరకు బ్రేక్ పడింది. వివరాల్లోకి వెళ్తే మలయాళ స్టార్ ఫహద్ ఫజిల్ హీరోగా నటించిన “ధూమం” సినిమాను ఈ బ్యానర్ లోనే నిర్మించారు. ఇక సౌత్ భాషలన్నింటిలోనూ జూన్ 23న రిలీజ్ అయిన ఈ సినిమా అన్నింట్లోనూ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఫహద్ పజిల్ ఉండడం వల్ల ఈ సినిమా మలయాళంలో ఒక మోస్తరుగా ఆడుతుంది.

అయితే “ధూమం” సినిమా ప్లాప్ కావడానికి పెద్దగా కారణం లేకపోయినా మరీ ఇంత డిజాస్టర్ కావడానికి మాత్రం నిర్మాణ సంస్థే కారణం. ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ మినహా మిగతా ఏ రకమైన ప్రమోషన్లు “ధూమం” సినిమాకి చేయలేదు. అదీగాక అన్ని సినిమాల ఊపులో తమ బ్యానర్ పేరుపై ఈ సినిమా ఆడేస్తుడనుకున్నారో లేక, కంటెంట్ గురించి ముందే తెలిసి ఆడదని గ్రహించి లైట్ తీసుకున్నారో తెలియదు గాని, ఈ బ్యానర్ లో ఫస్ట్ డిజాస్టర్ పడిందని చెప్పవచ్చు.

- Advertisement -

అయితే ధూమం సినిమా ప్లాప్ వల్ల హోంబలె ఫిల్మ్స్ కి పెద్దగా నష్టమేమి జరగలేదు. సినిమాకి అంత బడ్జెట్ పెట్టలేదు గనుక తక్కువ నష్టపోతారు. అయితే ఇప్పుడు తమ దృష్టి మొత్తం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న “సలార్” సినిమాపై పెట్టారు. ఈ సినిమాతో మరో 1000కోట్ల సినిమా పొందాలని చూస్తున్నారు.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు