Sujeeth : పవన్ కళ్యాణ్ ఓజి లేటెస్ట్ లీక్- ఫ్లోలో ఫ్యాన్స్ సుజీత్ కి గుడి కట్టిన కడతారు

పవన్ కళ్యాణ్ హీరోగా, యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో వస్తోన్న ఓజి సినిమా గురించి ప్రేక్షకులు ఎంత వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా టైటిల్ ఎనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమాపై స్టార్ట్ అయిన బజ్ ఈరోజుకి కూడా కంటిన్యూ అవుతూనే ఉంది.

గతంలో పవన్ కళ్యాణ్ బాలు, పంజా సినిమాలల్లో గ్యాంగ్ స్టర్ గా కనిపించగా ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేసారు. మళ్ళీ చాలా ఇయర్స్ గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ OG సినిమాలో గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి కంబ్యాక్ ఇచ్చిన తరువాత నుంచి చేస్తున్న అన్ని సినిమాల్లోకెల్లా OG సినిమాపైనే భారీ అంచనాలు ఏర్పడం విశేషం అని చెప్పొచ్చు.

ఇప్పటికే ఈ సినిమాలో అర్జున్ దాస్, శ్రియ రెడ్డి లాంటి తమిళ్ తారాగణంతో పాటు బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేస్తుండటం ఈ సినిమా స్థాయిని ఇంకా ఇంకా పెంచుతున్నాయి. అంతే కాదు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రి పాత్రకి గాను బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో మాట్లాడుతుననట్టు టాక్ వస్తుండగా, ప్రస్తుతం ఈ సినిమా నుంచి లీకైన మరో విషయం ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది. అదేంటంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పేరు ఓజాస్ గంభీర అని టాక్ నడుస్తోంది. ఈ పేరుకి షాట్ కట్ ఏ OG అని తెలుస్తోంది.

- Advertisement -

ఇక ఈ లీక్ తో పవన్ కళ్యాణ్ ఫాన్స్ అంత సినిమా హైప్ ని ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత దానయ్య డివివి ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తొందర్లోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు