Mega family: నిహారిక కొణిదెలపై వస్తోన్న ఆ వార్తలు నిజమే…

మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ మధ్య తరుచు వార్తల్లో నిలుస్తున్న విషయం అందరికి తెలిసిందే. గత కొద్దీ రోజులుగా వైవాహిత జీవితానికి దూరంగా ఉంటున్న ఈమె ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెడుతుంది. ఇటీవలనే డెడ్ పిక్సల్స్ అనే సిరీస్ లో నటించిన ఈమె ప్రస్తుతం మరో రెండు, మూడు ప్రాజెక్ట్ లతో బిజీ అవనుంది.

నిహారిక, చైతన్య జొన్నగడ్డని 2020 డిసెంబర్ 9న వివాహం చేసుకున్న విషయం అందరికి తెల్సిందే. అయితే వీరిద్దరి పెళ్లి కూడా అంగరంగ వైభవంగా రాజస్థాన్ లో ఉదయపూర్ ప్యాలస్ లో ఘనంగా జరిగింది.

పెళ్లి అయిన తరువాత యాక్టింగ్ కి నో చెప్పి, ప్రొడ్యూసింగ్ వైపు వెళ్లిన నిహారిక ఇటీవలనే మళ్ళీ యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేసింది. దాంతో చైతన్యతో మనస్పర్థలు వచ్చి, ప్రస్తుతం ఇద్దరు దూరంగా ఉంటున్నారు. దాంతో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు అనే పుకార్లు వచ్చిన వీటిపై మెగా ఫ్యామిలీ ఇంతవరకు స్పందించలేదు.

- Advertisement -

అయితే లేటెస్ట్ గా నిహారిక హీరోయిన్ మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతుందని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఒక మనసు సినిమాలో టాలీవుడ్ హీరోయిన్ గా పరిచమైన ఈ మెగా డాటర్ పలు సినిమాల్లో నటించిన హీరోయిన్ గా గుర్తింపు రాకపోవడంతో యాక్టింగ్ కి స్వస్తి చెప్పింది. ప్రస్తుతం భర్తతో దూరం పెరిగిన కారణంగా మళ్ళీ హీరోయిన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చూస్తుంది. అయితే ఇప్పుడిప్పుడే చైతన్యకి నిహారిక కు గొడవలు సద్దుమణుగుతున్నాయనే తరుణం నిహారిక తీసుకున్న ఈ నిర్మాణం తన వైవాహిక జీవితాన్ని ఎంత దూరం తీసుకువెళ్తుందో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు