Srikanth Reddy: బోయపాటి కి బాబులా ఉన్నాడు.

బోయపాటి శ్రీను, భద్ర సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి తన మొదటి సినిమాతోనే అద్భుతమైన పేరుని సాధించుకున్నాడు. ఇకపోతే భద్ర సినిమా తర్వాత చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. కానీ బోయపాటి సినిమా అంటే టక్కును గుర్తొచ్చేది నందమూరి బాలకృష్ణ. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మాత్రం ప్రతిదీ ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది.

మొదటి వీరిద్దరి కాంబినేషన్ సింహా సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సింహా సినిమా అంతటి ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత చేసిన లెజెండ్ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించింది. ఇకపోతే రీసెంట్ గా వచ్చిన అఖండ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. అయితే బాలకృష్ణ మినహా ఏ హీరోతో చేసిన బోయపాటి శ్రీను సినిమాలు అంతగా విజయాన్ని సాధించవు.

బోయపాటి సినిమాల్లో మనకి టక్కున గుర్తు వచ్చేది యాక్షన్ సీక్వెన్సెస్. బోయపాటి సినిమాల్లో వైలెన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడు బోయపాటి సినిమాల్లో వైలెన్స్ ని కూడా తలదన్నేలా మరో కొత్త డైరెక్టర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చినట్టు అర్థమవుతుంది. అది ఎవరు అంటే శ్రీకాంత్ రెడ్డి. వైష్ణవ తేజ్, శ్రీ లీల జంటగా నటిస్తున్న ఆదికేశవ్.
ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు శ్రీకాంత్ రెడ్డి. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలైంది.

- Advertisement -

ట్రైలర్ లోనే కొన్ని క్యూట్ సీన్స్ తో పాటు వైలెన్స్ సీన్స్ కూడా ప్రెసెంట్ చేశారు. ఇకపోతే శ్రీకాంత్ రెడ్డి రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఒక విషయాన్ని చెప్పుకొచ్చాడు. అదేంటంటే ఈ సినిమాలో ఒక ఫైట్ సీన్ల లో నోట్లోకి ట్యూబ్ లైట్ కొడితే వెనకనుంచి వస్తుందట. దీన్నిబట్టి సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ వైరల్ గా మారాయి. బోయపాటి శ్రీను కంటే దారుణంగా తయారయ్యాడు అంటూ, బోయపాటికి బాబులా తయారయ్యాడు అంటూ ట్రోల్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆ వైలెన్స్ ఏ రేంజ్ లో వర్కౌట్ అయిందో అర్థమవుతుంది

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు