Tamannah : ఆ డైరెక్టర్ కోసం అలాంటి పనులు చేస్తున్న తమన్న ?

Tamannah :  టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ తమన్న గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అతి తక్కువ కాలంలోనే తమన్న స్టార్ హీరోయిన్గా మారింది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేస్తోంది మిల్కీ బ్యూటీ తమన్న. మిల్కీ బ్యూటీ తమన్నాకు ఉన్న ఫాలోయింగ్ ఏ హీరోయిన్ కు లేదని చెప్పవచ్చు. సినిమాలు ఉన్న లేకున్నా… ఆమెకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గదు.

ఈ మధ్యకాలంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కూడా చేస్తుంది ఈ బ్యూటీ. అటు మొన్న జైలర్ సినిమాలో ఓ సాంగ్ చేసి ఇండియాను షేక్ చేసేసింది తమన్నా భాటియా. 34 ఏళ్ల హీరోయిన్ తమన్నా ఇంకా పెళ్లి చేసుకోలేదన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో రిలేషన్ లో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే తమన్నా మరియు విజయవర్మ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.

కాగా టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా కూడా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రొడక్షన్లో ఓదెల రైల్వే స్టేషన్ సినిమా వచ్చి బంపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాను అశోక్ తేజ తెరకెక్కించారు. అయితే ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ కూడా ఉందట. అయితే ఈ సీక్వెల్ లో తమన్నా భాటియా నటించబోతున్నట్లు సమాచారం. సంపత్ నంది మరియు తమన్నా మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా… ఈ ప్రాజెక్టుకు మిల్కీ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక ఈ విషయం బయటకు రావడంతో… ఆ టాలీవుడ్ దర్శకుడు కోసం తమన్నా ఇలాంటి హాట్ పాత్రలు చేస్తుందా అంటూ కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు