Milk Beauty : తలైవా ప్రాజెక్ట్ లోకి..

తలైవా రజనీకాంత్ 169వ చిత్రానికి రెడీ అవుతున్నారు. “బీస్ట్” చిత్ర దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించనున్నారు. కాగా సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. “జైలర్” సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ వారంలోనే మొదలుకానుంది. జైలర్ పై ఇప్పటికే అంచనాలు భారీగా నెలకొన్నాయి. జైలులోని ఖైదీల నేపథ్యంలో రూపొందుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్రను పోషిస్తుంది. నరసింహ సినిమా తర్వాత చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఈ క్రేజీ కాంబినేషన్ జైలర్ తో కుదిరింది. దీంతో దక్షిణాది ప్రేక్షకుల్లో ఆసక్తి విపరీతంగా పెరిగింది.

రమ్యకృష్ణ తో పాటు కన్నడ హీరో శివరాజ్ కుమార్ కూడా కీలక పాత్రను పోషించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం జైలర్ సినిమా షూటింగ్ కోసం హైదరాబాదులో భారీ సెట్లు వేశారు. వచ్చే వారమే షూటింగ్ ప్రారంభం కానుంది. దీనికి డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ సర్వం సిద్ధం చేసుకున్నాడు. అయితే తాజా అప్డేట్ ప్రకారం మిల్కీ బ్యూటీ తమన్నా రజనీకాంత్ జైలర్ సినిమాలో నటించనున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

తెలుగు, తమిళ తో పాటు ఇతర భాషల్లో తమన్నా బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించింది. అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. త్వరలోనే జైలర్ మూవీ షూటింగ్ లో తమన్నా జాయిన్ కానుందని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం తమన్న తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమా చేస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు