Pushpa 2 : ఈసారి మిల్కీ బ్యూటీ

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల‌లో ఒక‌రైన సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ” పుష్ప”. ఈ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ పాన్ ఇండియా మూవీ తో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సాధించాడు. రెండో భాగం ” పుష్ప ది రూల్” త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. మొదటి పార్ట్ కి మంచి ఆదరణ లభించడంతో ఆ అంచనాలకు తగ్గకుండా సుకుమార్ రెండో భాగాన్ని తీర్చిదిద్దే పనిలో ఉన్నారు.

ఈ క్రమంలో పుష్ప 2 కి మరింత క్రేజ్ తీసుకొచ్చే పనిలో ఉంది చిత్ర బృందం. అయితే ఈ మధ్య ఈ సినిమాలో విజయ్ సేతుపతి, మనోజ్ బాజ్పాయి నటిస్తారంటూ వార్తలు వచ్చాయి. అయితే అలాంటివేవీ ఏమి లేవంటూ నిర్మాణ సంస్థ తేల్చి చెప్పింది. ఇప్పుడు టాలీవుడ్ లో మరో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటమ్ సాంగ్ కి ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అయితే పార్ట్ 2 లో కూడా ఓ అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ సాంగ్ ఓ గిరిజన నేపథ్యంలో సాగుతుందని.. ఈ సాంగ్ లో మిల్కీ బ్యూటీ తమన్నాను తీసుకోవాలనే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ అడపాదడపా ఐటమ్ సాంగ్స్ చేస్తుంది తమన్నా. ఇటీవ‌ల‌ ‘గని’ సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పుష్ప 2 తో మరోసారి అలరించనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు