Kanguva: సూర్య మగధీరను దింపేస్తున్నాడా?

Kanguva

ఒప్పుకోవాల్సిన నిజం ఏంటంటే… ప్రస్తుతం కథలు ఎక్కువ లేవు. పైగా ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. సాధారణ కథ తీసుకుని, మసిపూసి మారెడుకాయ చేసి హిట్ కొట్టే రోజులు లేవు ఇప్పుడు. ఓటీటీల పుణ్యమా అని సాధారణ ప్రేక్షకుడికి కూడా ఎంతో టాలెంట్ వచ్చింది. దర్శకులు ఏ మాత్రం కాపీ కొట్టినా, ఇట్టే దొరికిపోతారు. ఆ వెంటనే ట్రోల్స్ కు గురవుతారు. అలాంటి సందర్భాలు ఈ మధ్య చాలా ఎక్కువే జరిగాయి.

అందుకే దర్శకులకు కథలను ఎంచుకోవడం పెద్ద టాస్క్ గా మారిపోయింది. అందుకే మరుగున పడ్డ చరిత్రను తవ్వుతున్నారు. తాజాగా అలా వస్తున్న మూవీ కంగువ. 14వ శతాబ్ధంలో ఒక గిరిజన రాజు గురించిన కథతో కంగువ సినిమా వస్తుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల అయింది. ఇందులో సూర్య… ఒక క్రూరమైన రాజు పాత్ర చేస్తున్నాడు. సూర్య లుక్ తోనే సినిమా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 2024 ప్రారంభంలో రాబోయే ఈ మూవీ ఎన్నో రికార్డలను కొల్లగొట్టడం ఖాయమని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం కోలీవుడ్ సర్కిల్స్ లో హాల్ చల్ చేస్తుంది. ఈ సినిమా… తెలుగులో వచ్చిన మగధీరను పోలి ఉంటుందట. మగధీరలో రామ్ చరణ్ పాత్ర రియల్ పోర్షన్ లో ఉంటుంది. అలాగే హిస్టారికల్ గా వచ్చే సన్నివేశాల్లో ఉంటుంది. సేమ్ అలాగే కంగువ మూవీలో కూడా హీరో సూర్య పాత్ర ఇటు రియాలిటీ, అటు హిస్టారికల్ బేస్ చేసుకుని వచ్చే సన్నివేశాల్లో ఉంటుందని తెలుస్తుంది.

- Advertisement -

అయితే దీనిపై మూవీ యూనిట్ పై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఒక వేళ ఈ గాసిప్స్ నిజమైతే, రియాలిటీకి, హిస్టారికల్ కి ఎలాంటి సంబంధం పెడుతాడు దర్శకుడు అనేది ఆసక్తికరంగా ఉందని చెప్పొచ్చు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు