Guntur Karam: గందరగోళం

త్రివిక్రమ్ శ్రీనివాస్.. కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమాలను తీయడంలో దిట్ట. ప్రస్తుతం త్రివిక్రమ్ చేస్తున్న సినిమా గుంటూరు కారం. ఇదివరకే మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా, ఇప్పుడు టీవీ లో వచ్చిన ప్రతిసారి హైయెస్ట్ టీఆర్పీ తో తమ ఖలేజా ఏంటో చూపిస్తాయి.

హ్యాట్రిక్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా విషయంలో చాలా గందరగోళం జరుగుతుంది. మొదటి ఈ సినిమాను సమ్మర్ రిలీజ్ అని ప్లాన్ చేసి అనౌన్స్ చేసారు. అది కాస్తా సంక్రాంతికి వాయిదా పడింది. ఇప్పుడు సంక్రాంతికి కూడా ఈ సినిమా వస్తుందో రాదో అని అయోమయంలో ఉన్నారంతా.

ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి ఒక యాక్షన్ సీక్వెన్స్ తీశారు. అనుకున్నట్లు రాలేదు అని చెప్పి దానిని ప్రక్కన పెట్టేసారు. కథలో మార్పులు జరగడం. పూజ హేగ్దే ను సినిమా నుండి తొలగించడం తో పాటు, రీసెంట్ గా ఈ సినిమా dop ను కూడా మార్చినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. కానీ వీటిపై మూవీ టీం కూడా స్పదించట్లేదు.

- Advertisement -

కాకపోతే ఈ సినిమా కష్టాలు ఇప్పుడు మాత్రమే కాదు, వీరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా టైములో కూడా చాలా జరిగాయి. ఈ ప్రాసెస్ అంతటిలో గట్టిగ వినిపిస్తున్న మాట ఏంటి అంటే గురూజీ కథతో బాబు హ్యాపీ గా లేరని, చేంజెస్ చెప్తూ వెకేషన్ కి చెక్కేస్తున్నారని వినిపిస్తోంది.

ఏది ఏమైనా గుంటూరు కారం నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ , గ్లిమ్స్ మాత్రం ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చాయి. చక,చక షూటింగ్ జరిగిపోయి సంక్రాంతికి ఈ సినిమా రిలీజైతే తమ అభిమాన హీరోను చూసుకుందామని మహేష్ ఫ్యాన్స్ వెయిటింగ్. తరువాత రాజమౌళి సినిమా ఎప్పుడో రిలీజ్ అవుతుందో తెలియదు కదా.

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు