Power Star: ‘ఓజీ’ లో అదిరిపోయే సప్రైజ్ – ఫ్యాన్స్ కి పూనకాలే..!

సుజిత్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా ఓజీ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. డ్రగ్ మాఫియా బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా వైడ్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానుంది అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటీవలే డైరెక్టర్ సుజిత్ రిలీజ్ గ్లిమ్ప్స్ వీడియో సినిమాకి మరింత హైప్ క్రియేట్ చేసింది. తాజాగా వినిపిస్తున్న మరో వార్త ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంది. అదేంటంటే, పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ చైల్డ్ హుడ్ క్యారెక్టర్లో కనిపించనున్నాడట.

ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర మూడు దశల్లో ఉంటుందని, అందులో 17ఏళ్ళ వయసులో పవన్ కళ్యాణ్ పాత్రలో అకీరా ని నటింపజేయాలని డైరెక్టర్ సుజిత్ భావిస్తున్నాడని ఆ వార్త సారాంశం. అయితే, సుజిత్ ఈ ఆలోచనని పవన్ కళ్యాణ్ తో పంచుకోలేదని అంటున్నారు. ఒకవేళ ఈ ప్రపోజల్ కి పవన్ కళ్యాణ్ గనక గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలోనే అకీరాని బిగ్ స్క్రీన్ పై చూసే అవకాశం ఉందన్నమాట. అకీరా తరచూ టాలీవుడ్ సెలెబ్రిటీలతో టచ్ లో ఉంటాడు, ఈ మేరకు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇటీవలే ఓ షార్ట్ ఫిలిం కి మ్యూజిక్ డైరెక్షన్ చేసి అందరిని పరిచిన అకీరా త్వరలో తన యాక్టింగ్ తో కూడా అలరిస్తాడని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సెట్స్ మీద ఉండగానే ఇంత బజ్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో అన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి పాన్ ఇండియా హిట్ ఇస్తుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు