Adikeshava: వైష్ణవ్ తేజ్ ని ఇబ్బంది పెడుతున్న శ్రీ లీల..!

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం ఆదికేశవ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వైష్ణవ్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా గ్లిమ్ప్స్ ఇటీవలే విడుదలై సినిమా మీద ఆసక్తిని పెంచింది. ఈ సినిమా రిలీజ్ జులైలో ఉంటుందని టాక్ వచ్చింది కానీ, పరిస్థితి చూస్తే అనుకూలంగా లేదని తెలుస్తోంది. జులైలో పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మరో పక్క శ్రీ లీల డేట్స్ అడ్జస్ట్ కాకపోవటం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని సమాచారం అందుతోంది. ఈ క్రమంలో ఆదికేశవ జులైలో రిలీజ్ అవ్వటం అసాధ్యం అనే చెప్పాలి.

వైష్ణవ్ గత రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడం వల్ల ఆదికేశవ హిట్ అవ్వటం కీలకంగా మారింది. రొటీన్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు హీరోయిన్ శ్రీలీల మాత్రమే పాజిటివ్ అంశంగా కనిపిస్తుంది. ఆచార్య సహా గతంలో టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు పెద్దగా సక్సెస్ అవ్వకపోవటం కూడా ఈ సినిమాపై బజ్ లేకపోవటానికి కారణం అని చెప్పవచ్చు.

ఉప్పెన సినిమా ద్వారా మొదటి ప్రయత్నంలోనే 100కోట్ల క్లబ్ లో చేరిన వైష్ణవ్ తేజ్ కి ఇప్పుడు హిట్ తప్పనిసరైన పరిస్థితి నెలకొంది. టైటిల్ గ్లిమ్ప్స్ మినహా వేరే అప్డేట్ లేని ఈ సినిమా రిలీజ్ జులైలో గనక లేకపోతే, ఆగస్టు ఫస్ట్ వీక్ లేదా సెప్టెంబర్ మాత్రమే సరైన సమయం అని చెప్పచ్చు. మరి, టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన శ్రీలీల ఆదికేశవకి డేట్స్ అడ్జస్ట్ చేసి అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అయ్యేలా చేస్తుందా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు