DJ Tillu : టిల్లు గానితో యంగ్ హీరోయిన్

పెళ్లి సందD సినిమాతో ఒక్కసారిగా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది శ్రీలీల. ప్రస్తుతం ఈ హీరోయిన్ టాలీవుడ్ లో వరుసగా అవకాశాలను దక్కించుకుంటుంది. పెళ్లిసందD సినిమాలో శ్రీలీల యాక్టింగ్ తో పాటు తన అందచందాలతో వావ్ అనిపించింది. ఈ యంగ్ హీరోయిన్ కేవలం గ్లామర్ ను మాత్రమే నమ్ముకోలేదు. నటనతో కూడా మంచి మార్కులు తెచ్చుకుంది. శ్రీ లీల చేతిలో ప్రస్తుతం ఐదు సినిమాలు వరకు ఉన్నాయని తెలుస్తోంది. రవితేజతో ‘ధమాకా’ సినిమాలో శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసింది.

మరోపక్క నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో శ్రీలీల ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇది ఇలా ఉండగా, తాజాగా ఈ బ్యూటీ కి మరో బంపర్ ఆఫర్ వచ్చిందట. యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.

అయితే, ‘డీజే టిల్లు’ కు సీక్వెల్ ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. డీజే టిల్లు 2లో హీరోయిన్ మారబోతోంది. ఇందులో సిద్దుతో మొదటిసారి జతకట్టడానికి అనుపమ పరమేశ్వరన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మొదట ఒక టాక్ వచ్చింది. కానీ అవి రూమర్లేనని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరో వార్త వినిపిస్తుంది. డీజే టిల్లు సీక్వెల్ లో టిల్లు గానీ గర్ల్ ఫ్రెండ్ గా శ్రీలీలను చూపించాలని చిత్ర దర్శక నిర్మాతలు అనుకుంటున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కాబోతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు