Tollywood: సమ్మర్ ని దున్నేసిన చిన్న హీరోలు..!

సినిమాల సక్సెస్ విషయంలో అప్పుడప్పుడు సీజన్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సమ్మర్ సీజన్లో రిలీజ్ అయ్యే సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కూడా బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇటీవల విడుదలైన నాని దసరా, తేజ్ విరూపాక్ష సినిమాలు ఇదే ప్రూవ్ చేసాయి. తొలి ఆట నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాలు తేజ్, నానీల కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. దసరా సినిమా ద్వారా నాని తొలిసారి 100కోట్ల మార్క్ అందుకొని టైర్1 హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయిన ఈ సినిమా అప్పటివరకు సౌత్ కి మాత్రమే పరిమితం అయిన నాని ని నార్త్ ఆడియెన్స్ కి కూడా పరిచయం చేసింది.

ఇక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ నుండి కోలుకున్న తరవాత సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో హారర్ జానర్లో వచ్చిన విరూపాక్ష సినిమా రిలీజ్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విరూపాక్ష తేజ్ కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్ దిశగా అడుగులేస్తోంది. తేజ్ సరసన నటించిన సంయుక్త ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అయ్యిందని చెప్పాలి. తేజ్ కెరీర్లో తొలిసారిగా నటించిన హారర్ జానర్ సినిమా కావటంతో ఈ సినిమా ప్రత్యేక స్థానంలో నిలుస్తుంది.

అయితే, ఈ రెండు సినిమాల దర్శకులు సుకుమార్ శిష్యులే కావటం విశేషం. టాలీవుడ్ పరిధి ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ వ్యాపించింది కాబట్టి విరూపాక్ష సినిమాని హిందీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు సినిమా యూనిట్. ఏదేమైనా టైర్ 2హీరోలు సమ్మర్ ఆరంభంలో బ్లాక్ బస్టర్స్ ఇవ్వటం టాలీవుడ్ కి శుభ పరిణామం అని చెప్పాలి. నాని, తేజ్ ల తర్వాత ఏజెంట్ సినిమాతో  ప్రేక్షకుల ముందుకి వస్తున్న అక్కినేని అఖిల్ కూడా బ్లాక్ బస్టర్ అందుకుంటాడా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు