Tej: దూసుకుపోతున్న విరూపాక్ష..!

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ లు హీరో హీరోయిన్లుగా సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ స్టేజ్ కి చేరిన విరూపాక్ష రిలీజ్ తర్వాత బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని తొలివారంలోనే బ్రేకివెన్ సాధించింది. తొలి వారం ముగిసాక కూడా విరూపాక్ష స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదు. యుఎస్ లో వన్ మిలియన్ మార్కు చేరుకొని తేజ్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ దిశగా అడుగులేస్తోంది. యాక్సిడెంట్ నుండి కోలుకున్న తర్వాత తేజ్ కి ఈ సినిమా మంచి కామ్ బ్యాక్ ఇచ్చిందని చెప్పాలి.

తెలుగు రాష్ట్రాల్లో 20కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా, వరల్డ్ వైడ్ 30కోట్ల మార్క్ చేరువలో లాభాల బాటలో నడుస్తోంది. నిర్మాతకి కూడా ఈ సినిమా ద్వారా చాలా కాలం తర్వాత హిట్ దక్కింది. ఈ సినిమాలో తేజ్, సంయుక్తల నటనకు ప్రశంసలు అందుతున్నాయి. తేజ్ కెరీర్లో తొలిసారి నటించిన హారర్ జానర్ సినిమా కావటంతో ఈ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుంది.

మొత్తానికి రిలీజ్ ముందు నుండే పాజిటివ్ బజ్ సొంతం చేసుకున్న విరూపాక్ష ఆశించిన దానికంటే మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాకు పార్ట్2 కూడా ఉండబోతోంది అన్న వార్త రాగానే సోషల్ మీడియాలో హీట్ పెరిగింది. హారర్ సినిమాలంటే తనకి భయం అని చెప్పిన తేజ్ అదే జానర్ ద్వారా తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకోవటం విశేషం. అయితే అఖిల్ ఏజెంట్ సినిమా రేపు రిలీజ్ అవుతుండగా విరూపాక్ష ఇదే జోరు కొనసాగిస్తుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు